ఒకప్పుడు సినిమా తీయాలంటే ఏదో ఒక కథ రాసుకుని కాస్త నాలెడ్జె ఉంటే మ్యానేజ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు సినిమా కథ బలంగా ఉండటంతో పాటూ ఎవ్వరూ ఊహించని లాజిక్ లను కూడా సినిమాలో ఉండేలా చూసుకోవాలి. ఇక ఈ మధ్య కాలంలో కొత్త దర్శకుల హవా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సుకుమార్ శిష్యులు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో హిట్ లు కొడుతున్నారు.
Advertisement
అంతే కాకుండా సుకుమార్ శిష్యుడు అంటేనే ఆ సినిమాకు ఎక్కడా లేని మైలేజ్ వస్తుంది. ఇక సుకుమార్ శిష్యులలో ఒకరైన శ్రీకాంత్ ఓదెల ఇటీవల దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మొదటి సినిమాతోనే ఈ డైరెక్టర్ పాన్ ఇండియా సినిమాను తీయడం విశేషం. అంతే కాకుండా ఈ సినిమాలో హీరోగా నాచురల్ స్టార్ నాని నటించాడు. అదేవిధంగా హీరోయిన్ గా కీర్తీ సురేష్ నటించింది.
Advertisement
అంతే కాకుండా నానికి స్నేహితుడి పాత్రలో దీక్షిత్ శెట్టి నటించాడు. అయితే ఈ సినిమా కథను పేర్లతోనే డైరెక్టర్ లింక్ చేశాడు. నాని పేరు సూరి కాగా కీర్తి సురేష్ పేరు వెన్నెల. అంతేకాకుండా నాని స్నేహితుడి పేరు ధరణి. అయితే సూరి అంటే సూర్యుడు వెన్నెల అంటే అర్థం తెలిసిందే. అయితే సూర్యుడు వెన్నెల కలిసే అవకాశాలు అంటాయి. కానీ ధరణి అంటే భూమి ఇక భూమి వెన్నెల కలిసే అవకాశమే ఉండదు.
కాబట్టి ఆ లాజిక్ ను ఆలోచించే దర్శకుడు ముగ్గురి పేర్లను అలా ఎంపిక చేశాడని క్లియర్ గా అర్థమవుతోంది. ఇక సుకుమార్ సినిమాలోనూ ఇటాంటి లాజిక్ లే మనకు కనిపిస్తాయి. కాబట్టి సుకుమార్ శిష్యుడు కదా ఆయన అంత కాకపోయినా ఆయనలో సగం అయినా అనుకోవచ్చేమో. ఇక మొదటి సినిమానే ఇంత లాజిక్ గా తీస్తే శ్రీకాంత్ ఓదెల ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి.
ALSO READ :Samyuktha : టాలీవుడ్ లక్కీ భామ.. ఈ హీరోయిన్ ఉంటే సినిమా పక్క హిట్?