Ad
టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ పొజిషన్లో ఉంది అంటే దానికి అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. వారు హీరోగా గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఇండస్ట్రీని కూడా డెవలప్ చేశారు. అలాంటి అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగార్జున స్టార్ హీరోగా ఎదిగారు. అంతేకాకుండా తన బిడ్డ కొడుకు సుమంత్ కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయం మనందరికీ తెలుసు. ప్రేమ కథ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి వచ్చిన సుమంత్ భారీ ఫ్లాప్ నందుకున్నాడు. అలా చాలా సినిమాలు చేశాడు. అయినా ఏ సినిమా హిట్ అవలేదు. ఈ తరుణంలోనే మళ్లీరావా,సుబ్రహ్మణ్యపురం అనే హిట్ సినిమాలు కాస్త ఊరటచ్చాయి.
కానీ ఆ తర్వాత చేసిన చిత్రాలు ఆయనకు గుర్తింపు ఇవ్వలేకపోయాయి. దీంతో కెరియర్ డల్ అయిపోయింది. ఆయన కెరియర్ లాగే ఆయన నిజ జీవితం కూడా సక్సెస్ కాలేక పోయింది. తొలిప్రేమ మూవీ తో మంచి హీరోయిన్గా గుర్తింపు పొందిన కీర్తి రెడ్డిని సుమంత్ పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలింది. కొద్దిరోజుల తర్వాత వీరిద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడంతో విడాకుల ద్వారా దూరమయ్యారు. ఇక అప్పటి నుంచి సుమంత్ పెళ్లి మాట ఎత్తడం లేదు. తాజాగా ఆయన వారాహి అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం కథపరంగా చూస్తే బాగుందని సూపర్ హిట్ కొట్టబోతున్నట్టు సమాచారం.
అయితే రీసెంట్ గా వచ్చిన సార్ సినిమాలో సుమంత్ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఆయన పాత్రకు మరింత పేరు వచ్చింది. అయితే సుమంత్ కీర్తి రెడ్డి విడిపోవడానికి అసలు కారణం కీర్తి రెడ్డి చెప్పిన మాట సుమంత్ అస్సలు పట్టించుకునే వారు కాదట. ఈ తరుణంలో కీర్తి రెడ్డి కూడా సుమంత్ పై అరుస్తూ ఉండేదట. దీంతో ఇద్దరి మధ్య కుదరదని చెప్పి విడాకులు తీసుకున్నారట.
Advertisement