తెలంగాణలో సినిమాలను బట్టి టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపడంతో ప్రభుత్వం ధరలను పెంచుకునేలా వెసులుబాటు కల్పిస్తూ కొన్ని కండిషన్లను పెట్టింది. ఇక ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రావడంతో థియేటర్లు ధరలను పెంచాయి. తాజాగా పెంచిన ధరల ప్రకారం…మహేష్ బాబు కి సంబంధించిన ఏఎంబి సినిమాస్ లో అదే విధంగా ప్రసాద్స్ ఐమాక్స్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ ధర రూ.350 చేశారు. అదేవిధంగా సెకండ్ క్లాస్ టికెట్ ధరను 295 కు సవరించారు.
ఇక పివిఆర్ మల్టీప్లెక్స్ థియేటర్ల లో ఫస్ట్ క్లాస్ టికెట్ ధర రూ. 350 ఉండగా సెకండ్ క్లాస్ టికెట్ ధర రూ. 290 కి పెంచారు. అదేవిధంగా థర్డ్ క్లాస్ టికెట్ ధరను రూ. 150 గా ఫిక్స్ చేశారు. ఇక మొత్తంగా ఏషియన్ మల్టీప్లెక్స్ థియేటర్ల లో చూసినట్లయితే ఫస్ట్ క్లాస్ టికెట్ ధర రూ. 350 ఉండగా సెకండ్ క్లాస్ టికెట్ ధర రూ.250…. థర్డ్ క్లాస్ టికెట్ ధర రూ. 175 గా సవరించారు. హైదరాబాద్ లో ఉన్న అన్ని మల్టీప్లెక్స్ లలో కూడా టికెట్ ధరలు ఒకే విధంగా ఉన్నాయి. పెంచిన ధరలు హైదరాబాద్ మల్టీప్లెక్స్ థియేటర్ల లో ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయి.
Advertisement
Advertisement
also read : బుల్లెట్టుబండి వధువుకు క్రేజీ ఆఫర్..త్వరలోనే ఆ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు..!
త్వరలో రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. దాంతో పెరిగిన ధరలతో తెలంగాణలో కలెక్షన్లు కూడా గట్టిగానే వచ్చే అవకాశం ఉంది. ఇదిలాఉంటే ఏపీలో లో టికెట్ ధరలు చాలా తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. పది నుండి మొదలై మూడు వందల లోపే టికెట్ల ధరలు ఉన్నాయి. ఇప్పటికే కరోనా వల్ల థియేటర్లు చాలా నష్టపోయారని… సినీ పరిశ్రమ కూడా నష్టాల్లో ఉందని ఓ వైపు సినీ పెద్దలు మరోవైపు థియేటర్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయి.