Ad
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని తన అంద చందాలతో అదరగొట్టిన శ్రీదేవి అంటే తెలియని వారు ఉండరు. అలాంటి ఆమె తెలుగులోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపును సాధించింది. అప్పట్లో ఈమె హీరోయిన్ గా ఉంది అంటే తప్పనిసరిగా సినిమా హిట్ అవ్వాల్సిందే. ఈమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు కూడా వెయిట్ చేసేవారు. అలాంటి అందాల సుందరి ప్రస్తుతం మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. అయితే ఆమె నట వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్.
సౌత్ లోనూ తన క్రేజ్ ఇంకా పెంచుకునేందుకు తారక్ కు జోడిగా ఎన్టీఆర్ 30 మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ స్తోంది. ఇక్కడ కూడా సక్సెస్ అందుకుంటే మాత్రం శ్రీదేవిలా చక్రం తిప్పవచ్చని భావిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనను పెళ్లి చేసుకునే వ్యక్తి ఏ విధంగా ఉండాలో తెలియచేసింది. నాతో ఎక్కువగా సమయాన్ని కేటాయించాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే నా తండ్రి కంటే ఎక్కువ హైట్ ఉండాలి.
ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి దొరికితే మాత్రం తప్పకుండా వివాహం చేసుకుంటానని తెలియజేసింది. అయితే ఆమె ప్రస్తుతం యంగ్ బిజినెస్ మ్యాన్ షికారు పహారియాతో ప్రేమలో ఉంది. ఈ ప్రేమ విషయంపై క్లారిటీ ఇవ్వకపోయినా సరే ఇద్దరు కలిసి టూర్లు, పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
Advertisement