ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న జంటల మధ్య చాలావరకు సఖ్యత కరువైందని చెప్పవచ్చు. ఎంతోమంది ప్రేమించుకున్న జంటలు కూడా కొంతకాలం సంసారం చేసి ఆ తర్వాత విడాకులకు దారి తీస్తున్నారు. ఇప్పటికే ఎంతో మందిని సెలబ్రిటీలు విడాకులు తీసుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్, నాగచైతన్య సమంత జంటలు విడిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు. వీళ్లతో పాటుగా మరి కొంతమంది జంటలు కూడా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. అలా ఎంతో పేరు సంపాదించుకున్న ఈ జంటలు కూడా విడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
also tread:నటుడు శరత్ బాబు గురించి ఎవరికీ తెలియని రహస్యాలు..!!
Advertisement
ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఐశ్వర్య కు విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకుందని తెలుస్తోంది. అప్పట్లో సోషల్ మీడియా లో వీరి విడాకుల వార్తలు అనేకం వచ్చాయి. అలాగే బుల్లితెర యాంకర్ సుమ కూడా తన భర్త రాజీవ్ కనకాలతో విడిపోవాలని అనుకున్నట్టు ఆమధ్య అనేక వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఈమధ్యనే చిరంజీవి డాటర్ శ్రీజ కూడా విడాకులు అనేక వార్తలు వినిపించాయి. తాజాగా నిహారిక కూడా విడాకులు తీసుకోబోతుందని ఇండస్ట్రీ కోడై కూసింది.
Advertisement
also read:ఒకేసారి రెండు ఓటీటీల్లో రానున్న శింబు మూవీ..!
ఈ తరుణంలో లేటెస్ట్ గా మరో ఇద్దరు స్టార్ జంటలు విడిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. నిజానికి ఆ ఇద్దరు స్టార్ జంటలు అన్యోన్య దంపతులుగా కనిపించే వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్లు విడాకులు తీసుకోవడానికి సిద్ధమవడంతో మిగతా జంటలు కూడా భయపడుతున్నారు. ఇంతకీ వాళ్లు ఎవరయ్యా అంటే బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్. అలాగే దీపికా పదుకొనే హీరో రణ్ వీర్ సింగ్ ప్రస్తుతం వీరి విడాకుల వ్యవహారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
also read:కాలికి నల్ల దారం కట్టేటప్పుడు ఈ 4 నియమాలు తప్పనిసరి పాటించాలి..లేదంటే నష్టమే..?