Home » Ugram Trailer : ‘ఉగ్రం’ ట్రైలర్ విడుదల… నరేష్ ఉగ్రరూపం

Ugram Trailer : ‘ఉగ్రం’ ట్రైలర్ విడుదల… నరేష్ ఉగ్రరూపం

by Bunty
Ad

 

అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్నటువంటి చిత్రం ‘ఉగ్రం’. వీరి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం నాంది సూపర్ హిట్ కావడంతో ఉగ్రం మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మిర్నా హీరోయిన్గా నటిస్తున్న ఉగ్రం చిత్రానికి తూము వెంకట్ కథను అందించారు. అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చారు.

read also : Nayanatara : ఆ రాజకీయ నాయకుడితో నయనతార రిలేషన్ షిప్ !

Advertisement

సిద్ సినిమాటోగ్రాఫర్ వ్యవహరించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలని తోలుత మేకర్స్ అనుకున్నారు. తాజాగా మే 5వ తేదీకి వాయిదా వేశారు. తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర బృందం. ఉగ్రం మూవీకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది.

Advertisement

read also : చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!

Ugram trailer – Intriguing & action-packed | 123telugu.com

ఉగ్రం మూవీలో అల్లరి నరేష్ పోలీసు అధికారిగా కనిపించారు. ఇందులో సినిమా కథాంశాన్ని రివిల్ చేశారు మేకర్స్. నగరంలో మిస్సింగ్ కేసుల వెనక ఉన్న కొంతమంది పవర్ఫుల్ వ్యక్తులపై నిజాయితీ కలిగిన ఓ పోలీస్ అధికారి భారీ రిస్క్ తీసుకొని చేసిన పోరాటమే ఈ చిత్ర కథాంశంగా తెలుస్తోంది. మరి ఈ పోరాటంలో హీరో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు. నేరస్థులను పట్టుకోడానికి అక్కడ ఏం చేశాడు, ఇలాంటివి తెలియాలంటే మూవీ విడుదల అయ్యేంతవరకు వేచి ఉండాల్సిందే.

read also : చిరంజీవికు బాలయ్య పంచ్…ఇది మామూలుగా లేదుగా!

Visitors Are Also Reading