ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్య నగరం విశాఖ అని..పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన కొనసాగుతుందని వెల్లడించారు సీఎం జగన్. ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని సీఎం జగన్ తెలిపారు.
READ ALSO : Agent : “ఏజెంట్” సినిమా ట్రైలర్…దుమ్ములేపిన అఖిల్
Advertisement
ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం పెడతానని.. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే అన్ని జిల్లాల అభివృద్ధి అన్నారు. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తపన అని.. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడని వివరించారు. మిగతా వాళ్లంతా ఏకమవుతున్నారని.. అంతా ఏకమై నాతో చీకటి యుద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు.
Advertisement
READ ALSO : తాళిబొట్టు తీసేసిన యాంకర్ శ్యామల..భర్తతో విభేదాలు పెరిగాయా?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెత్తందార్లకు, పేదల పక్షాన నిలబడిన నాకు మధ్య యుద్ధం జరుగుతోంది… ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతున్నారన్నారు సీఎం జగన్. వాళ్లలా అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదని.. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం మీరేనని వివరించారు సీఎం జగన్. ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరేనని.. దేవుని దయ.. మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నాని పేర్కొన్నారు. తోడేళ్లన్నీ ఏకమైనా.. నాకేమీ భయం లేదన్నారు సీఎం జగన్.
READ ALSO : ప్రత్యేకంగా అలాంటి దుస్తులు వేసుకోను… బేబీ బంప్ పై ఉపాసన !