Home » April 19th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

April 19th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీల భర్తీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రణాళికలు చేప‌డుతోంది.


తిరుమలలో భక్తుల రద్దీ త‌గ్గిపోయింది. కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం జ‌రుగుతోంది. నిన్న శ్రీవారిని 66,476 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు.

Advertisement

గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు క‌ప్పుకుంది. దాంతో హైదరాబాద్‌ నుండి విజయవాడకు రావాల్సిన ఇండిగో విమానం ఆలస్యం అవుతోంది.

వైఎస్‌ వివేకా కేసులో నేడు మరోసారి సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాష్‌రెడ్డి హాజ‌రుకానున్నారు.


శ్రీకాకుళం ‌‌జిల్లాలో నేడు సీఎం వైఎస్‌ జగన్ పర్య‌టిస్తున్నారు. మూలపేట పోర్ట్, వంశధార ఎత్తిపోతల‌, బుడగట్ల పాలెంఫిషింగ్ హార్బర్‌లకు శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

ఉప్పల్ స్టేడియంలో తాగుబోతులు హంగామా సృష్టించారు. సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మద్యం మత్తులో తోటి ప్రేక్షకులతో గొడవ పెట్టుకున్నారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపుచేశారు.

కొంతమంది సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, జోనల్ ఇంఛార్జులు, క్షేత్రస్థాయి సైనికులను కలవటం ఆనందంగా ఉందని వైఎస్ జ‌గన్ అన్నారు. తమ సచివాలయ పరిధిలోని ప్రతి గడపను అలసట లేకుండా సందర్శిస్తున్నారు ప్ర‌శంసించారు.

రామప్పలో వైభవంగా ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు జ‌రుగుతున్నాయి. ఈ వేడుక‌ల‌కు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస గౌడ్ హాజ‌ర‌య్యారు.

తెలంగాణలో క్రమంగా క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 52 కరోనా కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ లో 21 కేసులు నమోదయ్యాయి. దాంతో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తుంది.

Visitors Are Also Reading