సినిమా ఇండస్ట్రీలో తారలు పెళ్లి తరవాత కలిసి ఉంటారన్నది గ్యారెంటీ లేదు. ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు విడిపోతారో చెప్పలేం. అయితే చట్టం ప్రకారంగా భర్తలు భార్యలకు విడాకులు ఇచ్చే సమయంలో భరణం చెల్లించాల్సిందే. అలా విడాకులు తీసుకునే సమయంలో పలువురు సెలబ్రెటీలు విడాకుల సమయంలో భరణం చెల్లించారు. అలా ఎవరెవరు భరణం చెల్లించారు ఎంత చెల్లించారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
Advertisement
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొదటి భార్య నందినికి విడాకులు ఇచ్చి రేణూదేశాయ్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా నందినికి పవన్ భరణంగా కోటి రూపాయలు ఇచ్చారట. అంతే కాకుండా రేణూదేశాయ్ కి విడాకులు ఇచ్చి ఆ తరవాత పవన్ మరో మహిళను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సమయంలో పిల్లల కోసం పవన్ కోట్ల రూపాయలను భరణంగా ఇచ్చారని టాక్ వినిపించింది.
Advertisement
ఇక గతేడాది సమంత నాగచైతన్య కూడా విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల సమయంలో సమంతకు చైతూ కోట్ల రూపాలయలు భరణంగా ఇచ్చాడని టాక్ వినిపించింది. కానీ సామ్ ఒక్కరూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేసింది. సంజయ్ కపూర్ హీరోయిన్ కరిష్మా కపూర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్లి తరవాత అమెరికాలో స్థిరపడిన ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఇక వీరిద్దరూ ఇద్దరు పిల్లలు పుట్టిన తరవాత విడాకులు తీసుకున్నారు.
ఆ సమయంలో సంజయ్ కపూర్ 11 కోట్ల భరణంతో పాటూ కోట్ల విలువ చేసే ఇల్లు మరియు ఖరీదైన కార్లు ఇచ్చాడు. అదేవిధంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ మొదట రమాప్రభను వివాహం చేసుకున్నాడు. కాగా నయనతారతో ప్రేమాయాణం తరవాత మొదటి భార్యకు రూ.25 కోట్లు భరణంగా చెల్లించాడు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఇక విడాకుల సమయంలో తన భార్యకు హృతిక్ కోట్ల రూపాయలు ఇవ్వడంతో పాటూ ఫ్యూచర్ లో తను సంపాదించిన ఆస్తుల్లో భార్యకు వాటా ఉంటుందని స్పష్టం చేశాడు.
ALSO READ: చిరంజీవి సీరియల్ లో నటించాడనే విషయం మీకు తెలుసా ?