బిగ్ బాస్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందీలో బిగ్ బాస్ వరుస సీజన్ లతో దూసుకుపోతుంది. ఇక అక్కడ బిగ్ హోస్ట్ గా చేస్తున్న సల్మాన్ ఖాన్ ఏకంగా రూ.1000 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా టాక్ కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే తెలుగులో మాత్రం బిగ్ బాస్ హోస్ట్ కోసం మేకర్స్ కు తిప్పలు తప్పడం లేదు.
Advertisement
కొంతకాలం క్రితం బిగ్ బాస్ సీజన్ 6 పూర్తైన సంగతి తెలిసిందే. కాగా ఈ సీజన్ కు హోస్ట్ గా నాగార్జున చేశారు. వరుసగా మూడు సీజన్ లకు హోస్ట్ గా చేసిన నాగార్జున ప్రస్తుతం సినిమాల బిజీ నేపథ్యంలో ఇక పై హోస్ట్ గా చేయకూడదని నిర్నయించుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది.
Advertisement
మరోవైపు బిగ్ బాస్ షో నుండి వచ్చిన లీకుల వల్ల నాగార్జున చిరాకు పడ్డారని ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ నిర్వాహకులపై మండిపడ్డారని కూడా టాక్ ఉంది. లీకులపై ఫిర్యాదులు వచ్చినా కంట్రోల్ చేయకపోవడంతోనే నిర్వహాకులపై ఫైర్ అయ్యారని హోస్ట్ గా చేయనని స్పష్టం చేశారని టాక్.
దాంతో బిగ్ బాస్ సీజన్ 7 కొత్త హోస్ట్ ఎవరు అనే చర్చ జోరుగా వినిపిస్తోంది. ఇక తాజా టాలీవుడ్ టాక్ ప్రకారంగా బిగ్ బాస్ సీజన్ 7 కు హెస్ట్ గా రానా రాబోతున్నారట. రానా ఇప్పటికే ఓ ఆ టాక్ షోకు హోస్ట్ గా చేసి అభిమానులను సంపాదించుకున్నారు. అంతే కాకుండా రానా బయపెట్టే వాయిస్ ఆయన పర్సనాలిటీ ఈ షో కు ప్లస్ అవుతుందని నిర్వాహకులు ఆలోచించారట. ఇక రానా హోస్ట్ గా వస్తే కంటెస్టెంట్ లకు చెమటలు పట్టించడం కాయం.
ALSO READ :Agent : “ఏజెంట్” సినిమా ట్రైలర్…దుమ్ములేపిన అఖిల్