తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ కపుల్ గా మంచి గుర్తింపు పొందిన జంటల్లో సమంత నాగచైతన్య ముందు వరుసలో ఉండేవారు. ఈ జంటను చూసి అక్కినేని అభిమానులు ఎంతో మురిసిపోయారు. కానీ వారి సంతోషం మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. ఏం మాయ చేసావే అనే సినిమాతో పరిచయమైన వీరి స్నేహం ప్రేమగా మారి అనంతరం పెళ్లి వరకు దాడి తీసింది. పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాలు సంతోషంగా గడిపిన వీరు ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. అనూహ్యంగా విడాకుల బాట పట్టి విడాకులు తీసేసుకున్నారు. ఆ తర్వాత ఎవరి లైఫ్ లో వారు బిజీగా గడుపుతూ వస్తున్నారు.
Advertisement
Also Read:తెలుగు రాష్ట్రాల్లో సోను సూద్ కొత్త పార్టీ..పవన్ తో పొత్తు ఉంటుందా ..?
కానీ విడాకుల తర్వాత వీరు ఇద్దరు సినిమాల్లో ఊహించని ఫలితాలు ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం వీరు విడిపోవడం అంటూ చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. వీరి జాతకం ప్రకారం విడిపోవడం వల్ల వీరికి దోషం పట్టుకుందని, అందువల్లే ఏది మొదలుపెట్టినా కలిసి రావడం లేదని, సమంత కు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని , ఇద్దరికీ సినిమాల్లో వరుస ఫ్లాపులు వస్తున్నాయని అంటున్నారు. అయితే వీరు విడిపోవడానికి కొన్ని రోజుల ముందుగానే నాగచైతన్య హీరోగా తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ మాత్రమే సక్సెస్ అయింది. ఆ తర్వాత నాగచైతన్య నటించిన బంగార్రాజు సినిమా హిట్ అయినా అది నాగార్జున ఖాతాలో పడింది.
Advertisement
Also Read:వైజయంతీ బ్యానర్ లోగో కు అన్నగారి ఫోటో ఎందుకు ఉంటుంది..? దాని వెనక ఉన్న స్టోరీ ఏంటి..?
ఆ తరువాత థాంక్యూ, లాల్ సింగ్ చద్దా వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ ఏడాది మే నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్న కస్టడీ మూవీ పై నాగచైతన్య ఆశలు పెట్టుకున్నారట. ఇక సమంత పుష్ప మూవీ లో స్పెషల్ సాంగ్ చేసినా కానీ అంతగా సక్సెస్ కాలేక పోయింది. ఇక ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్, సక్సెస్ అయినా కానీ ఈ చిత్రంలోని బోల్డ్ రోల్ సమంత ఫ్యామిలీ ఆడియన్స్ ను కాస్త హట్ చేసిందని చెప్పవచ్చు. యశోద మూవీ కూడా అంతంత మాత్రంగానే సక్సెస్ అందుకుంది. ఇక ప్రస్తుతం శాకుంతలం భారీ డిజాస్టర్ గా నిలిచింది. మరోవైపు ఆమె అనారోగ్య సమస్యలు.ఈ విధంగా విడాకులు తీసుకున్నప్పటి నుంచి సమంత నాగచైతన్య కెరియర్ చాలావరకు డల్ అయిపోయింది.దీంతో నెటిజన్స్ వీరు విడాకులు తీసుకోవడమే వారి పాలిట శాపంగా మారిందని కామెంట్లు పెడుతున్నారు.
Also Read:తాప్సీ అవకాశాల కోసం ఆ స్టార్ హీరోతో అలాంటి పని చేసిందా..?