Home » April 16th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

April 16th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

తిరుమల‌ మొదటి ఘాట్ రోడ్డులో ఏనుగులు హల్ చల్ చేశాయి. ఏడవ మైలు వద్ద ఏనుగుల గుంపు తిష్ట వేసింది. దాంతో ఘాట్ రోడ్డులో ప్రయాణీకులు భయాందోళన చెందుతున్నారు. ఏనుగులను తిరిగి అడవిలోకి పంపడానికి అటవీశాఖ శ్ర‌మిస్తోంది.

Advertisement

కడప జిల్లా పులివెందులలో వైఎస్ భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌కు నిరసనగా శాంతియుత ర్యాలీ నిర్వ‌హిస్తున్నారు. భాస్కర్‌రెడ్డి అనుచరులు ర్యాలీకి పిలుపునిచ్చారు. పులివెందుల ఆర్టీసీ సర్కిల్ నుంచి పులంగల్లు వరకు ర్యాలీ నిర్వ‌హించున్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 13 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు దర్శనానికి 6 గంటల సమయం ప‌డుతుంది. నిన్న శ్రీవారిని 81,305 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు సీబీఐ విచారణకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజ‌ర‌వుతున్నారు. కేజ్రీవాల్‌తో పాటు సీబీఐ కార్యాలయానికి పంజాబ్ సీఎం కూడా వెళ్ల‌నున్నారు.

Advertisement

ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. భాస్కర్‌ రెడ్డి సహా అవినాష్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని సైతం సీబీఐ అరెస్ట్ చేసింది.

ఐపీఎల్‌లో నేడు ముంబయిలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబయి ఇండియన్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఏపీలోని కడపలో ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. చెన్నై-కర్నూలు హైవే పై రాచిన్నాయపల్లె దగ్గర లారీ-బైకు ఢీ ల‌కు యాక్సిడెంట్ అయ్యింది. బైకుపై వెళ్తున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే క‌న్నుమూశారు.

నేటి నుంచి కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జ‌ర‌ప‌నుంది. ఇవాళ కోలార్‌కు రాహుల్‌ గాంధీ వెళ్ల‌నున్నారు. జై భారత్ పేరుతో భారీ బహిరంగ సభను ఆయ‌న ఏర్పాటు చేయ‌నున్నారు.

ఐదు నియామక పరీక్షల తేదీలను ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ రీ షెడ్యూల్ చేసింది. ఈ నెల 23 న జరగాల్సిన AMVI ప‌రీక్షను జూన్ 28 కి వాయిదా వేసింది.

Visitors Are Also Reading