Home » ఏపీ సీఎం జగన్‌ పరువు తీసిన శ్రీ రెడ్డి..అవమానిస్తున్నాడంటూ !

ఏపీ సీఎం జగన్‌ పరువు తీసిన శ్రీ రెడ్డి..అవమానిస్తున్నాడంటూ !

by Bunty
Ad

టాలీవుడ్‌ ఒకప్పటి నటి శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆమె అరకోర సినిమాల్లో నటించినప్పటికీ ఈమధ్య ఆమె ఏ పోస్ట్ చేసినప్పటికీ వైరల్ గానే మారుతుంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నదిగా కొనసాగడం కోసం హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో చాలామందితో చేదు అనుభవం ఎదురైంది. ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో చాలామంది ఈవెన్ కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులకు గురి చేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో ఈమె అప్పటినుంచి తెగ పాపులర్ అయ్యారు.

READ ALSO : మెగాస్టార్ కూతురితో ఉదయ్ కిరణ్ పెళ్లి..అతని వల్లే ఆగిపోయిందట…!

Advertisement

అయితే… ఎప్పుడు జగన్‌ కు సపోర్ట్‌ గా ఉండే.. శ్రీ రెడ్డి.. ఆయనకు వ్యతిరేకంగా తాజాగా పోస్ట్‌ పెట్టింది. జగన్‌ వల్ల ఏపీ వారికి అవమానం జరుగుతుందని ఆవేదనను వ్యక్తం చేసింది. ఆంధ్ర లోకూడా మంగ్లీ, కనకవ్వ లాంటి తెలంగాణ జానపద సింగర్స్ ని తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు జగన్ అన్న ..ఇది ఆంధ్ర జానపద కళాకారురుల్ని అవమానించడమే అన్న అంటూ చురకలు అంటించింది. ఆంధ్రాలో శ్రీకాకుళం,కృష్ణ,సీమ,అన్ని రాష్ట్రాల్లో అనేకమంది కళని నమ్ముకుని ఎంకరేజ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు..వీళ్ళు చచ్చిపోతే ఆంధ్ర కళలు అంతరించి పోయినట్టే ..కర్ణాటక (కాంతారా),తమిళనాడు (జల్లికట్టు),తెలంగాణ (బోనాలు ) ఇలా ప్రతి రాష్ట్రానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని వివరించింది.

Advertisement

READ ALSO : Vidudhala Part 1 Review – ‘విడుదల’ రివ్యూ..అంచనాలకు మించి ఉందిగా !

మన రాష్ట్రంలో కొండపల్లి బొమ్మలు ,కూచిపూడి నృత్యం ,బందర్ లడ్డులు ,శ్రీకాకుళం గిరిజన నృత్యాలు ,కోలాటాలు ,తిరుపతి,అమరావతి స్థూపాలు,గుహలు ,తడ ఫాల్స్ ,ఉప్పాడ,ధర్మవరం ,మంగళగిరి చీరలు ,చేనేత కార్మికులు,గోదావరి పాపి కొండలు ,వైజాగ్ ఓడ రేవు,రాంపా చోడవరం అడవులు,అరకు అందాలు,రాయల సీమ గొప్పతనం ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్ర ప్రత్యేకతలు అనేకం..ఆ తిరుపతి వేంకటేశ్వరుని తో పాటు ,కుబేర లక్ష్మి తిష్ట వేసుకుని కూర్చుని వుంది ఆంధ్ర లో ..జగనన్న మీ కృషి ,దృష్టి ఇంకొంచెం ఈ కళాకారుల మీద పెడితే,అలాగే టూరిజం ఎంకరేజ్ చేస్తే ఆంధ్ర అభివృద్ధి తొందరలో పరుగులు తీస్తుందని పోస్ట్‌ పెట్టింది శ్రీ రెడ్డి.

READ ALSO : ప్రియురాలి రూపంలో నరరూప రాక్షసి.. ప్రియుడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి చేసిన పని..ఏంటంటే ?

Visitors Are Also Reading