Home » వంట గదిలో ఈ వాస్తు టిప్స్ పాటించండి…ఫ్రిడ్జ్, గ్యాస్ స్టవ్ ఎక్కడ ఉండాలంటే ..?

వంట గదిలో ఈ వాస్తు టిప్స్ పాటించండి…ఫ్రిడ్జ్, గ్యాస్ స్టవ్ ఎక్కడ ఉండాలంటే ..?

by AJAY
Ad

జీవితంలో విజయం సాధించిన చాలామంది వాస్తుశాస్త్రాన్ని నమ్ముతుంటారు. అన్నీ వాస్తు ప్రకారం ఉంటే మంచి జరుగుతుందని భావిస్తారు. అందుకే ప్రస్తుతం వాస్తు నిపుణులకు వాస్తు శాస్త్రానికి కూడా డిమాండ్ పెరిగిపోయింది. నిజానికి వాస్తు నియమాలను ఇంట్లో ఆఫీసులో అన్ని ప్రదేశాల్లోనూ పాటిస్తూ ఉండాలి. ఇంట్లో ఉండే ప్రధానమైన వస్తువులను వాస్తు ప్రకారమే అమర్చాలి. అలాంటప్పుడే ఆర్థిక వృద్ధి సుఖశాంతులు ఉంటాయి. ఇంట్లో ఉండే ప్రధాన వస్తువుల్లో వంటగ్యాస్ కూడా ఒకటి.

vasthu tips

vasthu tips

సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం మనం నిప్పును దేవుడిగా కొలుస్తాం. అయితే అగ్నిదేవుడికి తూర్పు దిక్కు సరైన దిక్కు కాబట్టి తూర్పు దిక్కున ఉంచి వంట చేస్తే చాలా మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఎదురవవని చెబుతున్నారు. అదేవిధంగా ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ ను పడమర వైపుకు ఉంచాలని చెబుతున్నారు. నీటిని పట్టుకోవడానికి పడమరవైపు చాలా సరైన స్థలమని కాబట్టి పడమర వైపుకు ఫ్రిజ్ ను ఉంచాలని చెబుతున్నారు.

Advertisement

Advertisement

ఇతర ఆహార పదార్థాలను కూడా ఫ్రిజ్ లో స్టోర్ చేస్తారు… కాబట్టి పడమరన ఫ్రిజ్ ఉంచాలని చెబుతున్నారు. వంటగదిలో సింక్ ను ఈశాన్యం లో ఉండే మూలన ఉంచాలని చెబుతున్నారు. అంతే కాకుండా వంటగ్యాస్ పక్కనే సింక్ ఉండకుండా కాస్త పక్కన ఏర్పాటు చేసేలా చూసుకోవాలని అవి రెండూ ఒకదానికి మరొకటి విరుద్ధమని చెబుతున్నారు. వంట గదిలో వాస్తు టిప్స్ ను పాటించడం వల్ల ఇంట్లో సంతోషం ఉంటుందని మరియు కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు.

Visitors Are Also Reading