టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినా.. ఇప్పటికే ధోని క్రేజ్ అలాగే ఉంది. దీనికి నిదర్శనమే.. నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్. ఈ మ్యాచ్ వివరాల్లోకి వెళితే…. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ ఎమ్మెస్ ధోని మాత్రం అభిమానులను అలరించారు. తలైవా ట్రేడ్ మార్క్ షాట్లకు చెపాక్ మైదానం దద్దరిల్లిపోయింది.
READ ALSO : Karnataka elections : కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం..కాంగ్రెస్ అతి పెద్ద పార్టీగా !
Advertisement
ధోని ఆఖరి వరకు క్రిజులో ఉన్నప్పటికీ తన జట్టు ను గెలిపించలేకపోయాడు. చివరి ఓవర్ లో సీఎస్కే 21 పరుగులు అవసరం అవ్వగా, ధోని రెండు సిక్స్ లు బాధినప్పటికీ విజయం మాత్రం రాజస్థాన్ వైపే నిలిచింది. ఈ మ్యాచ్ లో కేవలం 17 బంతులు మాత్రమే ఎదుర్కొన్న మిస్టర్ కూల్ ఒక్క ఫోర్ మూడు సిక్సర్లతో 32 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.
Advertisement
READ ALSO : IPL 2023 : ఏమైంది సూర్య…ఎందుకు ఇలా ఆడుతున్నావ్?
ఇక ఇది ఇలా ఉండగా, ధోని బ్యాటింగ్ కు రాగానే డిజిటల్ బ్రాడ్ కాస్ట్ జియో సినిమా వ్యూస్ రూ. రెండు కోట్ల మార్కును దాటింది. ఆఖరి ఓవర్ రెండు సిక్సులు బాధిన అనంతరం ఈ సంఖ్య 2.2 కోట్లకు చేరింది. ఇదే జియో సినిమాకు ఆల్ టైం రికార్డ్ కావడం గమనార్హం. అంతకుముందు లక్నో సూపర్ జేయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ధోని కొట్టిన రెండు సిక్సర్లను లైవ్ లో ఏకకాలంలో 1.7 కోట్ల మంది వీక్షించారు ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా, తాజా మ్యాచ్ తో ఈ రికార్డు బద్దలు అయింది.
READ ALSO : Pushpa 2 : పుష్ప 2 లోనూ సమంత ఐటెం సాంగ్ ?