Home » April 13th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

April 13th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

భారత్‌లో కరోనా కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 10,158 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 30 శాతం పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది.

Advertisement

వైఎస్‌ వివేకా హ* కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుపై ఇవాళ తెలంగాణ హైకోర్టులో విచారణ జ‌రుగుతోంది. బెయిల్ పై బయట ఉన్న ఎర్ర గంగిరెడ్డి.. బెయిల్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ దాఖ‌లు చేసింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో 23 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది.

రేపటి నుండి మూడు రోజులు పాటు గుంటూరు మిర్చి యార్డుకు సెలవులు ప్ర‌క‌టించారు. ఈ నెల 14న అంబేద్కర్ జయంతి ఉండ‌టంతో ఆ రోజున సెల‌వు ప్ర‌క‌టించారు. ఇక‌ శని, ఆదివారం యార్డుకు సెలవులు ఉంటాయి.

నేడు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. పలువురు కేంద్ర మంత్రులను గవర్నర్ క‌ల‌వ‌నున్నారు.

Advertisement

తిరుమలలో 2 కంపార్టుమెంట్ ల‌లో భక్తులు వేచియున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటల సమయం ప‌డుతోంది. నిన్న శ్రీవారిని 63,244 మంది భక్తులు ద‌ర్శించుకున్నారు.

ఇవాళ సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీ కేసు విచారణకు రానుంది. మోడీ ఇంటి పేరు వ్యాఖ్యలపై రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించిన సంగ‌తి తెలిసిందే. కింది కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ పై కోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్ దాఖ‌లు చేశారు.

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ఆలోచన సీఎం కేసీఆర్‌దే న‌ని మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం నిర్మాణం చేశామ‌ని సచివాలయానికి వెళ్ళే ప్రతి ఒక్కరు అంబేద్కర్‌ విగ్రహం చూడాలని ఇక్కడ నిర్మించామ‌ని చెప్పారు.

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు న‌మోద‌య్యాయి. ఆదిలాబాద్ 41.8, రామగుండం, భద్రాచలంలో 41, నిజామాబాద్ 40.7, ఖమ్మం 40.6, మహబూబ్ నగర్, నల్లగొండలో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Visitors Are Also Reading