సంచలన బ్యాటింగ్ తో తెరమీదకు వచ్చిన సూర్య కుమార్ యాదవ్ 2022 లో పరుగుల వరద పారించాడు. అటు అంతర్జాతీయ క్రికెట్ లోనూ, ఇటు ఐపీఎల్ లోను రికార్డు స్థాయిలో పరుగులు చేశాడు. టీ20 క్రికెట్లో ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ అనిపించుకున్నాడు. మైదానంలో నలువైపుల షాట్లు కొడుతూ మిస్టర్ 360 అని అభిమానుల ప్రశంసలు అందుకున్నారు. అయితే గతనెల రోజులుగా మాత్రం పేలవ ప్రదర్శనతో విసిగిస్తున్నాడు.
READ ALSO : Niharika konidela : నిహారిక పనుల ఆస్తులు అన్ని కోట్లా? జర్మన్ లగ్జరీ కారు
Advertisement
ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ ను నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ముంబై బ్యాటర్ సూర్య పరుగులు ఏమి చేయకుండానే వెనుదిరిగాడు. ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు. గత ఆరు మ్యాచుల్లో సూర్య ఇలా 0(1), 0(1), 0(1), 15(16),1(2), 0(1) పరుగులకే అవుట్ కావడం ఇది నాలుగోసారి. ఈ నాలుగు సార్లు సూర్య తను ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయి వెనుతిరిగాడు.
Advertisement
read also : Tirumala : వెంకటేశ్వర స్వామి కి “వడ్డికాసులవాడు” అని పేరు ఎలా వచ్చింది ?
గత ఆరు మ్యాచుల్లో సూర్య పరుగులు మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ నుంచి సూర్యాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆ సిరీస్ లో సూర్య ఒక్క పరుగు కూడా చేయలేదు. పైగా అన్ని మ్యాచుల్లోనూ తను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. ప్రస్తుత ఐపీఎల్ లో కూడా అతడి రాత మారలేదు. త్వరలో ప్రపంచకప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో సూర్య త్వరగా ఫామ్ లోకి రావాలని టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ఆశిస్తోంది. సూర్య పేలవ ప్రదర్శనపై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.
read also : మన స్టార్ హీరో హీరోయిన్స్ అసలు పేర్లు ఇవేనని తెలుసా ? చాలామందికి తెలియని పేర్లు !