హైదరాబాద్ మెట్రో స్టేషన్ ల వద్ద భారీగా చలాన్లను విధిస్తున్నారు. మెట్రో స్టేషన్ ల దగ్గర హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లలో చలాన్ల విధిస్తున్నారు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో వాహనాల పార్కింగ్ చేసిన వారికి చలాన్లు విధిస్తున్నారని వాహధారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొహాలీ స్టేడియం అభివృద్దికి రూ.79.46 కోట్లను కేటాయించారు. ముంబై వాంఖడేకు రూ.78.82 కోట్లు కేటాయించారు.
Advertisement
దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 7,830 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 40,215 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
బెజవాడలో యువకులు రెచ్చిపోయారు. బెంజ్ సర్కిల్ లో అర్థరాత్రి వీరంగం సృష్టించారు. కారుకు అడ్డొచ్చాడని వాహనదారుడి మీద బెల్టుతో దాడి చేశారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో బీసీ కుల గణన చేయాలని నిర్నయించింది. మంత్రి వేణుగోపాల్ నేతృత్వంలో త్వరలో కమిటీ వేయబోతున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే బీహార్, పంజాబ్, ఒడిశా. ఆ రాష్ట్రాల్లో మంత్రి వేణుగోపాల్ కమిటీ అధ్యయనం చేస్తుంది.
Advertisement
నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. మార్కాపురంలో సీఎం జగన్ బహిరంగ సభను నిర్వహించారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
నేడు ఏపీలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని ప్రకటించింది. 126 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
బండి సంజయ్ తనను టార్గెట్ చేశారని సీపీ రంగనాథ్ అన్నారు. కేసులో ముద్దాయిగా ఉన్న వారు పోలీసుల తీరును తప్పుపట్టడం సహజమని అన్నారు. నేను అక్రమ ఆస్తులు సంపాదించినట్లు నిరూపిస్తే ఉద్యోగం వదిలిపోతానని చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు 189 మందితో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో 32 మంది ఓబీసీలు, 30 మంది ఎస్సీ, 16 మంది ఎస్టీ అభ్యర్థులకు చోటు దక్కింది.