ఛలో విజయవాడకు పిలుపునిచ్చిన సీపీఐ నేత రామకృష్ణ పిలుపునిచ్చారు. దాంతో తుమ్మళ్లపల్లి కళాక్షేత్రం వద్ద నిరసనకు దిగిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
నిజామాబాద్ మాజీ మేయర్, కాంగ్రెస్ నేత ధర్మపురి సంజయ్ ఇంటిపై దాడి జరిగింది. ఉదయం 6.30 నుంచి రెక్కీ నిర్వహించిన ఇద్దరు వ్యక్తులు ఇంటి లోపలికి చొరబడేందుకు యత్నించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Advertisement
లడఖ్ మంచు కొండల్లో విధులు నిర్వహిస్తు ప్రమాదవశాత్తు జారీ పడి మృతి చెందిన సైనికుడు మండ్ల ప్రసాద్ నెల్లూరు వాసిగా గుర్తించారు. మృతి చెందిన సైనికుడి స్వగ్రామం సీతారాంపురం గ్రామానికి నేడు మృతదేహాన్ని తరలిస్తున్నారు.
రేపు విశాఖ స్టీల్ ప్లాంట్ కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధుల బృందం వెళ్లనుంది. సీనియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలో సాంకేతిక నిపుణుల కమిటీ పయనం కానుంది. సింగరేణి కాలరీస్ జాయింట్ వెంచర్ కింద EOI ఆలోచన చేస్తోంది.
Advertisement
అణగారిన వర్గాల కోసం జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని సీఎం జగన్ అన్నారు. ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు జ్యోతిరావు ఆద్యుడు అని అన్నారు. చదువుతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడని చెబుతూ జయంతి సందర్భంగా ఆయనకు నివాళ్లు అర్పించారు.
జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తుతున్నారు. దాంతో అంజన్న దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. అయితే ఆలయం వల్ల కనీస వసతులు లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
నిర్మల్ జిల్లా భైంసాలో దొంగ నోట్ల కలకలం రేగింది. రెండు 5 వందల నోట్లు ఫేక్ నోట్లు గా గుర్తించారు. మార్కెట్ ఏరియాలో బాలుడు ఇచ్చాడని కూరగాయల వ్యాపారి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
రాష్ట్ర విభజన వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. తెలంగాణ వికాస్ కేంద్రం వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.
TSPSC పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగింది. ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్లు రికార్డ్ చేసేందుకు అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.