అమరావతిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అమరేశ్వర ఆలయంలోకి ప్రవేశించేందుకు టీడీపీ కార్యకర్తలు, నేతలు ప్రయత్నించారు. ఎమ్మల్యే శంకర్రావు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళు జరుగుతున్న నేపథ్యంలో నేడు బహిరంగచర్చ కోసం వైసీపీ, టీడీపీ కార్యకర్తలు భారీగా రోడ్డు మీదకు వచ్చారు.
సంగారెడ్డి జిల్లా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొల్లూరు ORR వద్ద SOT పోలీసులు -రామచంద్రపురం పోలీసులు సంయుక్త వాహన తనిఖీలు నిర్వహించారు. రెండు కార్లు, ఒక బైక్ పై 120 కేజీల గంజా*ని పోలీసులు పట్టుకున్నారు.
Advertisement
హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలోని సుచిత్ర-మేడ్చెల్ ప్రధాన రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు వేరువేరు రోడ్డు ప్రమాదాలలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే కన్నుమూశారు. కొంపల్లి సమీపంలో ఆగి ఉన్న కారును టిప్పర్ ఢీ కొట్టింది.
నాగర్ కర్నూల్ లో నేడు జూపల్లి కృష్ఱారావు భవితవ్యం తేలనుంది. ఖమ్మంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బందీపూర్, ముదుమలై టైగర్ రిజర్వ్‌లకు నేడు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లనున్నారు. ఈరోజు మైసూరులో ‘ప్రాజెక్ట్ టైగర్’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా ఈవెంట్‌లో తాజా పులుల గణన డేటాను ప్రధాని విడుదల చేయనున్నారు.
Advertisement
నేడు నగరంలో రెండో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్ లు సన్ రైజర్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో సొంత గడ్డపై జరిగే ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉంది.
వీకెండ్ కావడంతో హైదరాబాద్ నగరంలో పలు చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్,హైటెక్ సిటీల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ చేశారు. పోలీసుల తనిఖీల్లో పదుల సంఖ్యలో వాహనదారులు పట్టుబడ్డాయి. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ సమావేశం జరగనుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేయనుంది. ఇప్పటికే పార్లమెంటరీ బోర్డు ముఖ్యనేతలతో భేటీ జేపీ నడ్డా అమిత్ షా భేటీ అయ్యారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోయి అళ్వార్ ట్యాంక్ వరకు భక్తులు క్యూ లైనులో వేచివున్నారు. నిన్న శ్రీవారిని 85,450 మంది భక్తులు దర్శించుకున్నారు. 43,862మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.
జనసేనతో పొత్తు విషయంలో సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, జనసేన పొత్తుతో ఉన్నాయని అన్నారు. పొత్తు విషయంలో తమకు క్లారిటీ ఉందని… ఏం జరగాలో అది జరుగుతుందని అన్నారు.