మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో హీరోగా నటించాడు. అంతే కాకుండా భారీ బడ్జెట్ చిత్రాలలో కూడా నటించాడు. అయితే కొన్ని సార్లు అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు. భారీ అంచనాల నడుమ వచ్చిన సినిమాలు కూడా ఫ్లాప్ అవ్వొచ్చు. చిరంజీవి హీరోగా నటించిన అంజి సినిమా విషయంలో కూడా అలానే జరిగింది. అప్పట్లో భారీ బడ్జెట్ తో మరియు గ్రాఫిక్స్ తో తెరరెక్కించిన సినిమా అంజి.
ALSO READ :భార్యభర్తల బంధం బలంగా ఉండాలంటే పాటించాల్సిన 5 సూత్రాలు ఇవే..!
Advertisement
2004 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ఈ సినిమాను శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మించారు. అంతే కాకుండా కోడి రామకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో నిర్మాత శ్యాప్రసాద్ రెడ్డి డిప్రెషన్ లోకి వెళ్లిపోవాల్సి వచ్చింది. అంటే నిర్మాత ఈ సినిమా పై ఎంత నమ్మకం పెట్టుకున్నాడో అర్థం చేసుకోవచ్చు.
Advertisement
చిరంజీవి కూడా ఈ సినిమా పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. అయితే రిజల్ట్ చూసి మాత్రం అందరూ షాక్ అయ్యారు. కాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు కోడి రామకృష్ణ అంజి సినిమా ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలు వివరించాడు. శ్యాం ప్రసాద్ రెడ్డి చిరంజీవితో ఓ భారీ గ్రాఫిక్స్ సినిమా చేద్దామని తన వద్దకు వచ్చాడని కోడిరామకృష్ణ తెలిపారు. దాంతో తన వద్ద ఓ మంచి స్టోరి ఉందని ఆ స్టోరీతో కమర్షియల్ సినిమా చేద్దామని శ్యాం ప్రసాద్ రెడ్డికి చెప్పానని అన్నారు. కానీ ఆయన వినకుండా గ్రాఫిక్స్ సినిమా చేద్దామని తేల్చిచెప్పారట.
దాంతో చిరంజీవిని అయినా ఒప్పిద్దామని ఆయనను కలిసానని అన్నారు. ఆయనను కన్విన్స్ చేయాలని ప్రయత్నించినా ఆయన కూడా వినలేదని అన్నారు. దాంతో రెండేళ్లు పరిశోధన చేసి అంజి సినిమా స్క్రిప్ట్ ను సిద్దం చేశానని అన్నారు. ఆ సినిమా కోసం చిరు పడిన కష్టం మాటల్లో చెప్పలేమని అన్నారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆ సినిమా నాకు సంతృప్తిని ఇచ్చింది అంటూ కోడి రామకృష్ణ వ్యాఖ్యానించారు.
ALSO READ : డబ్బు కోసం భార్య ప్లాన్ వింటే ఆశ్చర్యపోకుండా ఉండరు.. చివరికీ ఏమైందంటే ?