పెళ్లి తరవాత జీవితాంతం కలిసిమెలిసి ఉండాలంటే భార్యాభర్తలు మొదట సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉంటేనే అ బంధం బలంగా ఉంటుంది. అయితే భార్య భర్తలు సంతోషంగా కలిసి మెలిసి ఉండాలంటే 5 సూత్రాలు పాటించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆ ఐదు సూత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం….భర్త ముందు భార్య అందంగా కనిపించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Advertisement
ఎంత బిజీగా ఉన్నా భర్త కోసం అందంగా రెడీ అవ్వాలని చెబుతున్నారు. అలా ఉండటం వల్ల భర్త భార్యను తప్ప పరాయి స్త్రీల గురించి ఆలోచించరట. అంతే కాకుండా భర్త ఆఫీస్ నుండి వచ్చిన వెంటనే ఆయనతో మాట్లాడాలని చెబుతున్నారు. తిన్నారా..అలసిపోయారా ఇలా ఏదో ఒక రకంగా భార్తతో మాటలు కలపాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.
Advertisement
అంతే కాకుండా ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చిన భర్తకు భోజనం పెట్టి అతడితో కలిసి భోజనం చేయాలట. అలా చేయడం వల్ల భార్యకు తన పై ఎంత ప్రేమ ఉందో భర్తకు సైతం తెలుస్తుందని మానసిక నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా భర్త కుటుంబ సభ్యులను కూడా భార్య తన కుటుంబ సభ్యుల మాధిరిగానే ట్రీట్ చేయాలని మానసిన నిపుణులు చెబుతున్నారు. అలా చేయడం వల్ల ఎలాంటి గొడవలు ఉండవని అంతే కాకుండా ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుందని చెబుతున్నారు. అదే విధంగా భార్యకు డబ్బు పొదుపు చేసే గుణం ఉండాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.
ALSO READ : జగన్ కు బాలయ్య మాస్ వార్నింగ్… సైకో ప్రభుత్వానికి చమరగీతం పాడాలని పిలుపు…