ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, సాయంకాలం అయ్యిందంటే ఏ ఊర్లో చూసినా బలగం సినిమా ప్రదర్శనలే కనిపిస్తున్నాయి. ఇలా ఊర్లలో పెద్ద పెద్ద తెరలుపెట్టి సినిమా చూస్తున్నారు అంటే ఇది ఎంత ప్రాచుర్యం పొందిందో మనం అర్థం చేసుకోవచ్చు.. ఈ సినిమానే కాదు ఈ సినిమాలోని నటీనటులు కూడా చాలా ఫేమస్ అయ్యారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి , రూప లక్ష్మి, నరసింహ, మురళీధర్ నటించి మంచి గుర్తింపును సాధించారు.
Advertisement
Also Read:కృష్ణ చెల్లిగా విజయనిర్మల 3 చిత్రాల్లో నటించిందని మీకు తెలుసా..?
హీరోయిన్ తల్లిగా హీరోకి మేనత్త పాత్రలో నటించిన రూప లక్ష్మి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది.. మా నాన్న ఒక రైతు.. ఆయనకు ఆరుగురు పిల్లలు.. నన్ను ఎకనామిక్స్ లెక్చరర్ కీ దత్తత ఇచ్చారు. అయినా నేను నా కుటుంబ సభ్యులతో చక్కగా కలిసే ఉంటాను. ఈ క్రమంలోనే చిన్న వయసులో తల్లి పాత్రను పోషించాను కదా. రేపు ప్రభాస్ వంటి హీరోలకు కూడా తల్లి పాత్ర చేయమని అడిగితే చేస్తానని అన్నారు. ప్రతి మహిళ జీవితంలో సంతృప్తినిచ్చే స్థానం అమ్మ అని ఆమె బదులిచ్చారు.
Advertisement
Also Read:చిరంజీవి నా పక్కనే కూర్చుంటావా..? అని అవమానించిన హీరోయిన్ ఎవరు ? ఎందుకు అన్నది ?
కాబట్టి అలాంటి పాత్రలు వస్తే నేను నటించడానికి సిద్ధమే అంటూ అన్నారు. 70 ఏళ్ల వ్యక్తికి అమ్మగా నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేశారు. దిల్ రాజ్, శిరీష్ నిర్మాతలుగా కమెడియన్ వేణు వెల్దండి తెరికెక్కించిన బలగం సినిమా పెద్ద హిట్ అయిందని, ప్రతి ఊర్లో పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసుకొని చూడడం మాకెంతో ఆనందాన్నిస్తుందని అన్నారు.
Also Read:Where is Pushpa: బన్నీ ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. తప్పించుకున్న పుష్ప ఏమయ్యాడు?