టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్ లలో వంశీపైడిపల్లి ఒకరు. ఆదిలాబాద్ నుండి వచ్చిన వంశీపైడిపల్లి దర్శకుడుగా సక్సెస్ అయ్యాడు. మున్నా సినిమాతో వంశీపైడిపల్లి దర్శకుడుగా ప్రస్థానం మొదలుపెట్టాడు. ఆ తరవాత స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసి అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక వంశీపైడిపల్లి తాజాగా వెన్నెల కిషోర్ హోస్ట్ గా చేస్తున్న అలామొదలైంది అనే టాక్ షోకు హాజరయ్యారు.వంశీపైడిపల్లితో పాటూ ఆయన సతీమణి కూడా ఈ షో లో పాల్గొన్నారు.
ALSO READ : నిరుద్యోగులకు అలర్ట్… మెట్రోలో ఉద్యోగాలు, నెలకు రూ. 1 లక్ష జీతం
Advertisement
ఇక ఈ టాక్ షో లో వంశీపైడిపల్లి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ షో లోనే తన భార్యను ఎలా కలుసుకున్నాడు..వీరిద్దరి మధ్య మొదట పరిచయం ఎలా జరిగింది అనే విషయాలను వంశీపైడిపల్లి వెల్లడించారు. మొదటిసారి కలిసిన తరవాత ఆమెతో ప్రేమలోపడిపోయానని చెప్పారు.
Advertisement
నువ్వు నా జీవితంలో ఉంటే నేను హ్యాపీగా ఉంటానని చెయ్యిపట్టుకుని చెప్పానని అన్నారు. ఆ విషయం చెప్పిన తరవాత తాను వెళుతున్నప్పుడు దిల్ వాలే దిల్హానే లేజాయెంగే లెవల్ వెనక్కి తిరిగి చూస్తుందని అనుకున్నాని కానీ అలా చూడలేదని అన్నారు. అంతే కాకుండా వెన్నెల కిషోర్ మాట్లాడుతూ..రాజుగారి హస్తం ఏమైనా ఉందా మీ స్టోరీలో అని అన్నారు.
దానికి వంశీపైడిపల్లి భార్య మాలిని మాట్లాడుతూ..బెంగుళూరు అమ్మాయి ఎందుకురా అని దిల్ రాజు అన్నారని చెప్పారు. వంశీపైడిపల్లి చిన్నపిల్లాడిలా అలుగుతారని అన్నారు. అంతే కాకుండా ప్రోమో చివరలో వంశీపైడిపల్లి తన భార్య వేలికి రింగ్ తొడిగారు.
ALSO READ : దాస్ కా ధమ్కీని ఎన్టీఆర్ సపోర్ట్ చేయడం వెనుక దాగి ఉన్న కథ అదేనా ?