ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో ప్రముఖ హీరోయిన్లు రష్మిక, తమన్నా సందడి చేశారు. తమ డ్యాన్స్ తో ప్రేక్షకులను ఉర్రుతలూగించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు, పుష్ప చిత్రంలోని శ్రీ వల్లి, సామీ సామీ తదితర పాటలతో రష్మిక, పుష్ప లోని ఊ అంటావా మావా, ఊ ఊ అంటావా, ఎనిమీ, టమ్ టమ్ సినిమాలోని పాటకు తమన్నా స్టెప్పులేసి అదుర్స్ అనిపించారు. ఈ ఇద్దరి పెర్ఫార్మెన్స్ తో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం హోరేత్తింది.
READ ALSO : ఆ హీరోయిన్ తో నాగ చైతన్య రిలేషన్…ఇలా అడ్డంగా దొరికిపోయారుగా!
Advertisement
Advertisement
మరోవైపు ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్ తన గాత్రంతో అలరించారు. ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొన్నాయి. ఈ మ్యాచ్ లో గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టాస్ ఓడి తోలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్మిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ బ్యాట్స్మెన్ ఆరంభం నుంచి అదరగొట్టారు. దీంతో విజయం సాధించారు. ఇది ఇలా ఉండగా… ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో ప్రముఖ హీరోయిన్లు రష్మిక, తమన్నా సందడి చేయడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఈ ఈవెంట్లో డాన్స్ చేసినందుకు రష్మిక, తమన్నా ఇద్దరు చెరో రూ.4 కోట్లు వసూలు చేశారట. ఇప్పుడు ఈ టాపిక్ వైరల్ గా మారింది.
READ ALSO : SriLanka : క్రికెట్లో పరువు పోగొట్టుకున్న శ్రీలంక.. 44 ఏళ్లలో ఇదే తొలిసారి