ఈ మధ్యకాలంలో చాలా మంది అమ్మాయిలు వివిధ రకాలుగా బిహేవ్ చేస్తున్నారు. వారికి అలాంటి అలవాట్లు ఏ విధంగా వస్తున్నాయో తెలియడం లేదు. కానీ ఆ వింత అలవాట్లతో వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు.. చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకొని అనారోగ్యం పాలవుతున్నారు. ప్రస్తుతం ఈ 14 ఏళ్ల బాలిక గురించి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మరి ఆ అమ్మాయి చేసిన తప్పేంటో ఇప్పుడు చూద్దాం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 14 ఏళ్ల బాలిక , 8 సంవత్సరాలు వచ్చేసరికి అందరి పిల్లల లాగే ఉన్నది. ఇక తొమ్మిదవ సంవత్సరం నుంచి ఆమెకు వింత జబ్బు వచ్చి పడింది.
also read:సచిన్ 10th ఫెయిల్.. ధోని12th పాస్..9th మాత్రమే చదివిన స్టార్ క్రికెటర్..ఎవరంటే.?
Advertisement
రాపంజెల్ సిండ్రోమ్ అనే సమస్య కారణంగా ట్రైకో వైరస్ అనే వ్యాధి బారిన పడింది. ఇకనాటి నుంచి వెంట్రుకలను క్రమక్రమంగా తినడం మొదలుపెట్టింది. ఈ కారణంగా మొన్నటిదాకా ఎలాంటి సమస్య లేకున్నా ఆమె శరీరం మాత్రం అభివృద్ధి చెందలేదు. ఏ చిన్న పదార్థం తిన్నా వాంతి చేసుకుంటూ ఉండేది. ఇక కొన్ని రోజులకు కడుపునొప్పి కూడా మొదలైంది . ఎన్ని మాత్రలు వాడిన తగ్గలేదు. చాలా ఆసుపత్రుల్లో చూపించారు తల్లిదండ్రులు.
Advertisement
also read:భారతీయులు ఇప్పటికీ ఇష్టపడే 5 అద్భుత బైక్స్.. ఏవో తెలుసా ..?
అయినా ఫలితం లేకపోవడంతో మంగళవారం కడుపునొప్పి తీవ్రమవడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ చేయించారు. దీంతో స్కానింగ్ చూసిన డాక్టర్లు షాక్ అయిపోయారు. ఆమె కడుపులో పెద్ద ఎత్తున వెంట్రుకల కట్ట ఉండడం వైద్యులను ఆశ్చర్యపరిచింది. చివరకు ఆపరేషన్ చేసి 2.5 కిలోల వెంట్రుకల కట్టను బయటకు తీసేశారు. వెంట్రుకలు జీర్ణం అవడం చాలా కష్టమని దీంతో ఏళ్లపాటు తిన్న వెంట్రుకలన్ని ఉదరకోహరం లో పేరుకుపోయాయని వైద్యులు తెలియజేశారు. ఈ విషయం కాస్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read:“బలగం” మూవీలో 4 బిగ్ మిస్టేక్స్.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు వేణు..!