ఇండియాలో ఇన్ స్టాగ్రామ్, ఫేస్బుక్ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ కోసం విధించే ఛార్జీలను మాతృసంస్థ మెటా వెల్లడించింది. మొబైల్ యాప్ లకు, డెస్క్ టాప్ బ్రౌజర్ లకు వేరువేరుగా ధరలు నిర్ణయించింది. మొబైల్ యాప్ ద్వారా ఫేస్బుక్ వాడితే నెలకు రూ.1,450 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. డెస్క్ టాప్ బ్రౌజర్ల వినియోగదారులు నెలకు రూ.1,099 చెల్లించాలని వెల్లడించింది.
READ ALSO : అమితాబ్ మనవడితో షారుఖ్ కూతురు డేటింగ్..నైట్ పార్టీలో ఆ పనులు ?
Advertisement
ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికాలో మాత్రమే ఈ బ్లూ టిక్ సౌకర్యం అందుబాటులో ఉంది. భారతీయులు ఇన్ స్టాగ్రామ్, ఫేస్బుక్ బ్లూ టిక్ సబ్ స్క్రిప్షన్ కావాలనుకుంటే మెటా వెరిఫైడ్ కోసం వెయిటింగ్ లిస్ట్ లో చేరవచ్చు. ప్రస్తుతం ధ్రువీకరించబడినది వ్యాపారాలకు మరియు 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులకు అందుబాటులో లేదని స్పష్టం చేస్తోంది.
Advertisement
READ ALSO : విడాకులపై సమంత సంచలన వ్యాఖ్యలు..”పుష్ప” ఐటెం సాంగ్ వద్దన్నారంటూ !
మెటా ధ్రువీకరించబడిన ప్రోగ్రామ్ కు ఎవరు అర్హులు అనే విషయానికి వెళ్తే కనీసం 18 ఏళ్ల నిండిన ఫేస్బుక్ మరియు ఇన్ స్టాగ్రామ్ వినియోగదారులు ఎవరైనా తమ ఖాతాను ధ్రువీకరించవచ్చు. పబ్లిక్ లేదా ప్రైవేట్ ప్రొఫైల్ ను కలిగి ఉన్న వినియోగదారుడు వారి ఖాతాలో కనీస కార్యాచరణతో పొందవచ్చు. వారి ఖాతాను ద్రువీకరించవచ్చు. అదేవిధంగా ఒక సర్కార్ ఐడిని కూడా సరిపోలే పేరు మరియు చిత్రంతో ధ్రువీకరణ పత్రంగా సమర్పించాల్సి ఉంటుంది.
READ ALSO : Adi Purush : శ్రీరామనవమి స్పెషల్… ‘ఆది పురుష్’ నుంచి కొత్త పోస్టర్… రిలీజ్ డేట్ పై మళ్లీ!