ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కీర్తి సురేష్ పేరే వినబడుతోంది. ఆమె సినిమాల పరంగా దూసుకుపోతున్న తరుణంలో ఆమె పర్సనల్ కెరియర్ గురించి కూడా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె ప్రేమ వ్యవహారం పెళ్లి గురించి అనేక వార్తలు నెట్ ఇంటా చక్కర్లు కొడుతున్నాయి. ఇదే విషయంపై కీర్తి సురేష్ ఎప్పుడు స్పందించలేదు కానీ తాజాగా ఆమె తల్లి మేనక వివాహ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. ఓ సందర్భంలో ఆమె మాట్లాడుతూ.. కీర్తి సురేష్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది అంటే ఆమెకు పాపులారిటి పెరుగుతుందని అర్థం.
also read:ఈ సీజన్ లో లభించే సపోటా పండ్లను తింటున్నారా ? అయితే ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!
Advertisement
మహానటి సినిమా ద్వారా మంచి గుర్తింపు సాధించుకున్న కీర్తి సురేష్ జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. ఇక అప్పటినుంచి ఆమె కెరియర్ టర్న్ అయిందని చెప్పవచ్చు. కమర్షియల్ కథ చిత్రాల్లో నటిస్తూనే నటనకు అవకాశం ఉన్న హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో కూడా నటిస్తోంది. తాజాగా ఆమె ఓ వ్యాపారవేత్తని త్వరలో పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం సాగుతోంది. దీనిపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్ తల్లి మేనక.. ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ ప్రేమలో పడిందని, పెళ్లికి సిద్ధమవుతోందని గాసిప్స్ చాలానే వస్తున్నాయని పేర్కొంది.
Advertisement
also read:ఓటీటీ నుంచి ‘రానా నాయుడు’ ఔట్.. అందుకోసమేనా..?
ఒకవేళ కీర్తి ఎవరినైనా ప్రేమిస్తే ఆ విషయాలు మాకు చెబుతుందని, ఆమె గురించి ఏ వ్యవహారం అయినా మేము బహిరంగంగా మీడియాతో వెల్లడిస్తామని అన్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ ఎవరిని ప్రేమించడం లేదని, ఆమె గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. ఈ విధమైన తప్పుడు వార్తలు కీర్తి సురేష్ గురించి వస్తున్నాయి అంటే ఆమె నటిగా చాలా ఎదుగుతుందని మేనక అన్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ నాని జంటగా నటించిన దసరా మూవీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.
also read:Dasara Review:దసరా మూవీ రివ్యూ.. నాని నటన మామూలుగా లేదే..!!