నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం తనకు కూడా ఆఫర్ వచ్చిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తే కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారని చెప్పారు.
పార్లమెంట్‌లో ఉదయం 10.15 గంటలకు ప్రతిపక్షాలు భేటీ అయ్యాయి. ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరుగుతోంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం కానుంది.
Advertisement
అనకాపల్లి బెల్లంకు ఈ సీజన్‌లో రికార్డు స్థాయిలో ధర పలికింది. వంద కేజీల బెల్లం ధర రూ.4,210 పలుకుతోంది. ఒడిశా నుంచి ఆర్డర్లు పెరగడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు.
నేడు కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఉదయం 11.30 గంటలకు ఎన్నికల కమిషన్ ప్రకటించనుంది. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీకి మే వరకు గడువును విధించారు.
విశాఖలో జీ-20 సమ్మిట్ రెండో రోజు సమావేశాలు జరుగుతున్నాయి. భవిష్యత్ నగరాల నిర్మాణానికి పెట్టుబడులు అనే అంశంపై నేడు సమ్మిట్ కొనసాగుతోంది. సా. 5 గంటలకు 2 రోజుల కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ముగియనున్నాయి. మరో 2 రోజుల పాటు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణా తరగతులు జరగనున్నాయి.
Advertisement
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకూండా నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. నిన్న 70,605 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. క్రిప్టో కరెన్సీ,కెప్టోగ్రఫీ, బ్లాక్ చైన్ మోసాలపై ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.
టీటీడీకి కేంద్రం ఊరటనిచ్చింది. FRCA లైసెన్స్ ను కేంద్రం రెన్యువల్ చేసింది. ఫారిన్ కరెన్సీ SBIలో డిపాజిట్ చేసుకునేందుకు అనుమతినిచ్చింది. లైసెన్స్ రెన్యువల్ చేయాలని 2019లో కోరగా ఇప్పుడు అనుమతులు లభించాయి.
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటూ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పర్యటిస్తున్నారు. ఏపీతో పాటూ తెలంగాణలో ఆయన పర్యటించనున్నారు.