Home » Mark Zuckerberg : మూడోసారి తండ్రి అయిన మార్క్ జుకర్ బర్గ్

Mark Zuckerberg : మూడోసారి తండ్రి అయిన మార్క్ జుకర్ బర్గ్

by Bunty
Ad

ఫేస్ బుక్‌ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ గురించి తెలియని వారుండరు. అయితే.. తాజాగా మార్క్ జుకర్ బర్గ్ మరోసారి తండ్రి అయ్యారు. జూకర్ బర్గ్ అర్ధాంగి ప్రిసిల్లా చాన్ మూడో కుమార్తెకు జన్మనిచ్చింది. మార్క్ జుకర్ కాలేజీ మేట్ అయిన ప్రిసిల్లా చాన్ ను ప్రేమించి పెళ్లాడారు. వీరి వివాహం 2012లో జరిగింది. ఈ జంటకు ఇప్పటికే మాక్సిమా, ఆగస్ట్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే మూడోసారి కూడా అమ్మాయి పుడుతుందని జూకర్ బర్గ్ కొన్ని నెలల కిందటే ప్రకటించారు.

READ ALSO : భర్త వేరే అమ్మాయితో… తిరుగుతున్నప్పుడు భార్య ఏం చేయాలి..!

Advertisement

అమెరికాలో లింగ నిర్ధారణ పరీక్షలు నేరం కాదు. మరోసారి అమ్మాయి పుట్టడం పట్ల జూకర్ బర్గ్ హర్షం వ్యక్తం చేశారు. తన కుమార్తె పేరు అరేలియా చాన్ జూకర్ బర్గ్ అని తెలిపారు. కాగా జూకర్ బర్గ్ గతేడాది సెప్టెంబర్ లో తన భార్య గర్భం దాల్చిన వార్తను ప్రకటించారు. సెప్టెంబర్ లో జూకర్ బర్గ్ ఇన్స్టాలో ఓ పోస్ట్ పెట్టారు.

Advertisement

READ ALSO : జానకిరామ్ భార్య రెండో పెళ్లి చేసుకోకుండా… ఆ ఫోటోలు వైరల్?

Mark Zuckerberg Wife, Kids, Son, Net Worth March 2023 | NAYAG Tricks

మూడోసారి తండ్రి అవుతున్నానని ఆ శుభవార్తను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. తన సతీమణి మూడోసారి ప్రెగ్నెంట్ అయిందని చెప్పారు. “మ్యాక్స్, ఆగస్ట్ కు వచ్చే ఏడాది ఓ చెల్లి రాబోతోంది” అని తన భార్యతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. 2012లో ప్రిసిల్లా చాన్ ను పెళ్లి చేసుకున్నారు జూకర్. ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలకు జన్మనిచ్చింది ఈ జంట. వాళ్ళ పేర్లు మాక్సిమా, ఆగస్ట్. ఇప్పుడు మూడోసారి కూడా కూతురు పుట్టినట్లు ప్రకటించారు జుకర్.

Visitors Are Also Reading