నందమూరి తారకరత్న ఇటీవల గుండె పోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నారాలోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలారు. ఆ తరవాత ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇక తారకరత్న ఫ్యామిలీ ఇప్పటికీ ఆయనను మరిచిపోలేకపోతోంది. తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి తరచూ భర్తక సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఎమోషనల్ అవుతోంది.
Advertisement
ఇటీవల తారకరత్న పుట్టినరోజు సంధర్బంగా అలేఖ్యరెడ్డి ఆయన ఫోటోను షేర్ చేసి ఎమోషనల్ అయ్యారు. జీవితంలో తారకరత్న ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నారని చెప్పారు. అంతే కాకుండా అప్పుడు ఇప్పుడూ బాలయ్య ఒక్కరే తమకు అండగా ఉన్నారని అలేఖ్యరెడ్డి వెల్లడించారు. ఇదిలా ఉంటే అలేఖ్యరెడ్డి మరోసారి తారకరత్నను గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యింది.
Advertisement
తారకరత్న చివరి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తారకరత్న హిందూపూర్ కు వెల్లడానికి ముందు కూతురు నిషిక తో కలిసి ఆడుకున్నారు. వీడియోలో తారకరత్న వీడియో గేమ్ చురుకుగా మాస్క్ వేసుకుని ఆడుతూ కనిపిస్తున్నారు. కాగా పక్కన ఆయన కూతురు కూడా ఉంది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దాంతో నందమూరి ఫ్యాన్స్ మరియు తారకరతత్న అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు. మిస్ యూ తారకరత్న అంటూ కామెంట్ లు పెడుతున్నారు.