పాకిస్తాన్ తో జరిగే ఆసియా కప్ టోర్నీపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. నిర్వహించాలని పిసిబి ప్రెసిడెంట్ చెబుతుంటే.. మరోవైపు పాకిస్తాన్ లో అడుగుపెట్టేదే లేదని బీసీసీఐ సెక్రటరీ జైషా పేర్కొన్నారు. అవసరం అయితే తటస్థ వేదికగా ఆసియా కప్ నిర్వహిస్తామని స్పష్టం చేయడంతో ఈ టోర్నీ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆసియా కప్ 2023 జరగనుంది. అయితే.. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే టోర్నీ పాక్ లో జరుగుతుండడంతో టీమిండియా అక్కడ ఆడేందుకు నిరాకరించింది.
READ ALSO : 2023 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్… హైదరాబాదులో ఆ మ్యాచులు!
Advertisement
Advertisement
దీంతో మొదట ఆసియా కప్ ను తటస్థ వేదికకు మార్చాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ భావించింది. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆసియా కప్ తమ దేశంలో నిర్వహించకపోతే ఈ ఏడాది చివర్లో భారత్ లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ ను బహిష్కరిస్తామని తెలిపింది. అటు బీసీసీఐ కూడా ఈ విషయంలో మొండి వైఖరితోనే ఉంది. దీంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇరు బోర్డుల మధ్య రాజీ కుదిరించేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగానే గురువారం రాత్రి ఎసిసి ఆధ్వర్యంలో పిసిబి, బీసీసీఐ బోర్డులు సమావేశం అయ్యాయి. ఈ నేపథ్యంలో టీమిండియా ఆసియా కప్ ఆడుతుందని, పాకిస్తాన్ లోనే జరుగుతుందని ఎసిసి తెలిపింది. అయితే భారత్ ఆడే మ్యాచ్లను మాత్రం తటస్థ వేదికపై నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారత్ ఆడే మ్యాచ్ లకు సంబంధించి ఓమన్, యూఏఈ, ఇంగ్లాండ్, శ్రీలంక పేర్లను పరిశీలించారు.
READ ALSO : సమాధిపై QR కోడ్… కొడుకు జ్ఞాపకాలు చెదిరిపోకుండా తండ్రి ఆలోచన!
ఈ వేదికలో ఏదో ఒకటి ఫైనలైజ్ చేయనున్నట్లు తెలిసింది. ఒకవేళ టీమిండియా ఆసియా కప్ ఫైనల్ బెర్త్ బుక్ చేసుకుంటే ఫైనల్ కూడా తటస్థ వేదికలో నిర్వహించాలని ఎసిసి నిర్ణయించింది. ఇందుకు పిసిబి కూడా అంగీకరించినట్లు ఎసిసి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లెక్కన ఆసియా కప్ విషయంలో బీసీసీఐ తమ పంతం నెగ్గించుకున్నట్లే. మరోవైపు పిసిబి మాత్రం ఎసిసి ప్రతిపాదనకు అంగీకరించడంతో ఒక మెట్టు దిగినట్లు అయింది.
READ ALSO : పడిపోయిన కోహ్లీ వాల్యూ…టాప్ ప్లేస్ లో చరణ్!