Home » Mar 24th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Mar 24th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

రేపు సీఎం వైఎస్‌ జగన్‌ ఏలూరు జిల్లా దెందులూరు పర్యటించ‌నున్నారు. వైఎస్సార్‌ ఆసరా ఆర్ధిక సాయాన్ని విడుద‌ల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.30 గంటలకు దెందులూరు చేరుకుని బహిరంగ సభలో వైఎస్సార్‌ ఆసరా ఆర్ధిక సాయాన్ని విడుదల చేయనున్నారు.

Advertisement

ప్రధాని న‌రేంద్ర‌మోడీ వారణాసి వార‌నాసిలో ప‌ర్య‌టిస్తున్నారు. వారణాసిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు.

ఎంపీ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. రేవంత్ ఇంటి చుట్టూ పోలీసుల మోహరించారు. రేవంత్ ఇంటి వైపు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

ఓయూలో ఉద్రిక్తత నెల‌కొంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిరుద్యోగ మార్చ్ ఉన్న సందర్భంగా ఓయూలో ముందస్తు అరెస్ట్ లు జ‌రుగుతున్నాయి. వసతి గృహాల్లో అరెస్టుల పర్వం కొన‌సాగుతోంది. ఆర్ట్స్ కళాశాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు ఏర్పాటు చేశారు.

Advertisement

నేడు బాస‌ర ఆల‌య పునఃనిర్మాణ ప‌నుల‌కు ఆంకురార్ప‌ణ జ‌రుగుతోంది. అమ్మవారి గర్భాలయ పునఃనిర్మాణంతో పాటు ఇత‌ర అభివృద్ధి ప‌నులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అంకురార్ప‌ణ చేయ‌నున్నారు.

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్ లో ఇద్ద‌రు యువకులు దుర్మరణం చెందారు. మృతులు తెలంగాణ రాష్ట్రం ,ఖమ్మం జిల్లా కొత్తగూడెంకి చెందిన చైతన్య(26),ప్రణీత్(24) గా గుర్తించారు. బాపట్ల సూర్యలంక బీచ్ నుండి కొత్తగూడెం వెళుతుండగా మైలవరం మండలం పుల్లూరు హైవేపై ఈ ఘటన చోటు చేసుకుంది.

సీఎస్‌, TSPSC, డీజీపీకి గవర్నర్‌ తమిళిసై లేఖ రాశారు. TSPSC పేపర్‌ లీకేజ్‌పై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సిట్‌ దర్యాప్తు వివరాలు, TSPSC ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వివరాలు.. పరీక్ష రాసిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల మార్కులు తెలపాలని గ‌వ‌ర్న‌ర్ లేఖ‌లో పేర్కొన్నారు.


సీతారామ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. మాజీ మంత్రి తుమ్మలతో సీతారామ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్ చ‌ర్చించారు. ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు.

Visitors Are Also Reading