తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు మనోజ్ అంటే తెలియని వారు ఉండరు. తండ్రి మోహన్ బాబు నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల భూమా మౌనికను రెండో వివాహం చేసుకొని మరోసారి వార్తల్లోకి ఎక్కారు.. ఇలాంటి ఆయన ఇటీవల తిరుపతిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తన తండ్రి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ ఎమోషనల్ అయ్యారు.. ఇంతకీ ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.. నా జీవితంలో మా తండ్రిని మించిన దైవం అనేది ఉండదని చెప్పవచ్చు.. ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తారో మాటల్లో చెప్పలేను.. మా నాన్న నాకు స్ఫూర్తి.. ఆయన దగ్గర నుంచి ఎన్నో మంచి విషయాలను నేర్చుకున్నానని అన్నారు. ఆయన ఇంతటి స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు.
also read:బాలయ్య నిజంగా దేవుడే.. తారకరత్న కోసం ఏం చేశాడంటే..?
Advertisement
Advertisement
ఆయన కష్టాలను కొన్నింటిని నేను దగ్గరుండి చూసాను.. కానీ అలాంటి కష్టం మాకు తెలియకుండా ఆయన మమ్మల్ని పెంచారు. ఆయన మాపై చూపించే ప్రేమ ముందు మేమేం చేసినా తక్కువే.. ఆయన ఏ పని చేసినా నిబద్ధతతో చేస్తారు. చేసే పనిని ప్రేమిస్తారు. మనం చేసే పనిని ప్రేమించే వారు తప్పనిసరిగా జీవితంలో ముందుకు వెళ్తారని మా నాన్నను చూస్తేనే అర్థమైందని అన్నారు. ప్రతి ఒక్కరు వారి లైఫ్ లో తప్పనిసరిగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇబ్బందులు వచ్చినప్పుడు అధైర్య పడకుండా ధైర్యంగా ముందుకు సాగితే విజయం వరిస్తుంది. నేను అలాంటి దశనే ఎదుర్కొన్న.. అలాంటి సమయంలో నా కుటుంబ సభ్యులు నాకు వెన్నుదన్నుగా ఉన్నారు.
also read:మహేష్ బాబు కొత్త సినిమాకు జగన్ పథకం పేరు!
ఈ టైం లోనే నా జీవితంలోకి వచ్చిన కొత్త వెలుతురు మౌనిక. తను ఏ పని చేయాలనుకున్నా నేను అండగా ఉంటా అన్నారు. ఎన్నోసార్లు నాన్నని ఇబ్బంది పెట్టాను. అయినప్పటికీ ఆయన మాపై ఉన్న ప్రేమతో నేను ఏ పని చేసినా వద్దని చెప్పలేదు. మౌనికని ఇష్టపడిన తర్వాత నాన్న దగ్గరికి వెళ్లాను. నాన్న నేను జీవితాంతం తోడుంటానని ఒక అమ్మాయికి మాటిచ్చానని చెప్పాను. ఆయన కూడా నా మాటకు గౌరవించి మా వివాహం జరిపించారు. మా నాన్న ప్రేమ ముందు నేనేం చేసినా తక్కువే, ఆయన రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ ఎమోషనల్ అయ్యారు మంచు మనోజ్.
also read:కోహ్లీ తినే బియ్యం కేజీ ఎంతో తెలుసా ? అందుకే అంత ఫిట్ గా ఉంటాడా !