పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు సాధారణ ప్రజలలోనే కాకుండా సెలబ్రెటీలలోనూ డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇక పవన్ కల్యాణ్ ను ఎక్కువగా అభిమానించేవారిలో బండ్ల గణేష్ కూడా ఒకరు. ఎంతలా అభిమానిస్తాడంటే పవన్ గురించి చెప్పమంటే తన నరాలు కట్ అయ్యే రేంజ్ లో బండ్ల గణేష్ స్పీచ్ ఇస్తాడు. ఏకంగా దేవుడు అంటూ ప్రశంసలు కురిపిస్తాడు.
Advertisement
అంతే కాకుండా పవన్ కల్యాణ్ ను ఎవరైనా ఏమైనా అన్నారంటే చాలు ఆగ్రహంతో ఊగిపోతూ కౌంటర్ లు ఇస్తుంటాడు. కాగా తాజాగా బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బండ్ల గణేష్ చాలా సార్లు చెప్పినప్పటికీ పవన్ తో సినిమా ఫిక్స్ అవ్వలేదన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో బండ్లకు ఆ టాపిక్ గురించి ప్రశ్నఎదురయ్యింది.
Advertisement
దాంతో పవన్ కల్యాణ్ తనను పక్కన పెట్టారని చాలా మంది అంటున్నారని కానీ అందులో నిజం లేదని బండ్ల గణేష్ అన్నారు. నేనే ఆయన మార్గానికి అడ్డుగా ఉండకూడదని పక్కకు వచ్చానని చెప్పాడు. సినిమాలు సంబంధించి పవన్ వెనక ఉంటానని..రాజకీయాలకు సంబంధించి కూడా పవన్ వెనకాల ఉంటానని అనుకోవడం తప్పని అన్నారు.
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పవన్ ముందున్న లక్ష్యం వేరని అందుకే పక్కకు వచ్చానని అన్నారు. వేరే కారణాలు చెప్పి తప్పించుకోవడానికి లేదని..పవన్ నాకు దేవుడే..పూజ మందిరంలో ఉన్నట్టు దేవుడు పవిత్రంగా ఉంటాడని అన్నారు. అంతే కాకుండా పవన్ ను దేవుడి కంటే ఎక్కువని భావిస్తానని కానీ అమ్మానాన్నల కంటే మీరే ఎక్కువ భార్య బిడ్డల కంటే మీరే ఎక్కువ అని చెప్పలేదని అన్నారు.
ALSO READ :మెగాస్టార్ బోళా శంకర్ రిలీజ్ ఎప్పుడో తెలుసా ?