ఆసియా కప్-2023 నేపథ్యంలో… టీమిండియా మరియు పాక్ జట్ల మధ్య వివాదం ఉన్న సంగతి తెలిసిందే. ఆసియా కప్-2023 నిర్వాహన వివాదం ఇంకా సద్దుమనగలేదు. ఈ ఏడాది ఆసియా కప్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సింది. అయితే భారత్-పాక్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా పాకిస్తాన్ లో పర్యటించడానికి బీసీసీఐ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ ను తటస్థ వేదికపై నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ను బీసీసీఐ సూచించింది. ఇక ఈ వివాదం నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఆసక్తికర వాక్యాలు చేశాడు.
READ ALSO : ఉగాది ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి?
Advertisement
Advertisement
రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడాలంటే క్రికెట్ ఒక్కటే మార్గమని ఆఫ్రిది స్పష్టం చేశాడు. అదేవిధంగా ఈ విషయం గురించి భారత ప్రధాని నరేంద్ర మోడీతో తాను త్వరలోనే మాట్లాడుతానని ఆఫ్రిది చెప్పాడు. ఈ విషయంపై ఆఫ్రిది మాట్లాడుతూ, “భారత్-పాక్ ల మధ్య సంబంధాలు బాగుపడాలంటే ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు, ఇతర టోర్నీలు జరగాలి. రెండు దేశాల మధ్య క్రికెట్ జరగాలని నేను మోడీ సార్ నే అభ్యర్థిస్తాను. మనం ఎవరితోనైనా స్నేహం చేయాలనుకున్న, వారు మనతో మాట్లాడకపోతే మనం ఏం చేయగలము.
READ ALSO : మంచు కుటుంబంలో కొత్త కోడలు హవా… అందరిని తొక్కేస్తోందా?
బీసీసీఐ చాలా బలమైన క్రికెట్ బోర్డు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మనం పెద్దదిక్కుగా ఉన్నప్పుడు, బాధ్యత కూడా అలానే ఉంటుంది. కాబట్టి మీరు మిత్రులను పెంచుకోవాలి తప్ప శత్రువులను కాదు. మీకు సంబంధాలు ఎంత ఎక్కువగా ఉంటే మరింత బలపడతారు. ఇక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బలహీనంగా ఏమీలేదు. ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్ కు ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది” అని పేర్కొన్నాడు.
READ ALSO : రెండో పెళ్లికి సిద్ధమైన నటి ప్రగతి…మంచి క్యాష్ పార్టీనే పట్టిందంటూ ?