సాధారణంగా ఉగాది పండుగను చాలా గొప్పగా జరుపుకుంటాం. పండుగ రోజు ఇంటికి మామిడి తోరణాలు కడితే ఆ ఇంటి కళనే వేరు ఉంటుంది. తోరణాలు కాకుండా గుమ్మానికి ఉగాది పండుగ రోజు ఏం కట్టాలనేది మాత్రం చాలా మందికి తెలియదు. ఉగాది దక్షిణ భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ పండుగ హిందూ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం మొదటి రోజున సూచిస్తుంది.
READ ALSO : తిరుమల భక్తులకు అలర్ట్….నడకదారి భక్తులకు దర్శనం టికెట్స్
Advertisement
భారతదేశంలో ఉగాది పండుగను బుధవారం మార్చి 22, 2023న జరుపుకుంటారు. ఉగాది చైత్ర శుక్ల ప్రతిపాదంలో వస్తుంది. సాధారణంగా ఈరోజు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి చివరిలో లేదా ఏప్రిల్ నెల ప్రారంభంలో ఉగాది పండుగ వస్తుంది. ఉగాది 2023 తెలుగు నామకరణం ‘యుగాది’ ద్వారా కూడా పిలవబడుతుంది. ఇది ‘యుగ’, ‘ఆది’ పదాల కలయిక. యుగం అంటే సమయం, ఆది అంటే ప్రారంభం అని అర్థం. ఉగాది ప్రాముఖ్యత హిందూ మతం యొక్క చరిత్ర, సాంస్కృతి, జీవన శైలిలో ఉంది. ఈ పండుగను జరుపుకోవడం ద్వారా ప్రజలు కొత్త సంవత్సరం రాకను స్వాగతించారు. ఈ రోజున ప్రజలు కొత్త ఉత్సాహం, కొత్త కలలు, కొత్త ఆశలతో జీవితాన్ని ప్రారంభిస్తారు.
Advertisement
ఉగాది రోజు ముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్నీ భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక.
ఉగాది పచ్చడి ప్రాముఖ్యత ఏంటి?
బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక
ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేప పువ్వు- చేదు- బాధ కలిగించే అనుభవాలు
చింతపండు- పులుపు -నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు- వగరు- కొత్త సవాళ్లు
కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు.
READ ALSO : విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్!