Home » తిరుమల భక్తులకు అలర్ట్….నడకదారి భక్తులకు దర్శనం టికెట్స్

తిరుమల భక్తులకు అలర్ట్….నడకదారి భక్తులకు దర్శనం టికెట్స్

by Bunty
Ad

 

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. కాలినడకన వచ్చే భక్తులకు ఉచిత దర్శనం టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తిరుమల కొండపైకి నడిచి వెళ్లే భక్తులకు ఉచిత దర్శనం టికెట్స్ త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. నాలుగంచెల విధానంలో భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. వసతితో పాటు లడ్డు ప్రసాదంలోనూ ఈ విధానం అమలు చేయడం ద్వారా ప్రయోజనం కలుగుతోందన్నారు.

read also : RRR సినిమాలో ఎన్టీఆర్ ది ఓ సైడ్ పాత్ర – వేణు స్వామి సంచలనం

Advertisement

 

అదే విధంగా రాష్ట్రంలో ఆదరణ తగ్గిన టీటీడీ కల్యాణ మండపాల నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. టీటీడీలో ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ విధానం ద్వారా భక్తులకు సేవలు సులభంగా అందుతున్నాయని వెల్లడించారు. “కోయిల్ అల్వార్ తిరుమంజనం ఈనెల 21వ తేదీన నిర్వహిస్తాం. ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాధన సేవను రద్దు చేస్తున్నం.

Advertisement

read also : NTR నుంచి మనోజ్‌ వరకు 2 లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్‌ స్టార్లు ?

Over 1 crore devotees visited Tirumala temple in 2021, 5.96 cr laddus sold:  TTD | The News Minute

దీంతోపాటు తిరుమలలో ఈ నెల 30వ తేదీన శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం జరగనుంది. 30వ తేదీన సాయంత్రం 6:30 గంటలకు శ్రీవారు, హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ నెల 31వ తేదీన శ్రీ రామ పట్టాభిషేకం నిర్వహిస్తున్నాం” అని ధర్మారెడ్డి వివరించారు. టిటిడిలో ప్రవేశపెట్టిన ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ విధానం ద్వారా భక్తులకు సేవలు సులభంగా అందుతున్నాయని వివరించారు. వేలాది మంది వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

READ ALSO : తరుణ్ – ఆర్తి లవ్ విషయం తెలిసిన తర్వాత వారి పేరెంట్స్ రియాక్షన్ ఇదే..!

Visitors Are Also Reading