వికారాబాద్ జిల్లా మర్పల్లికి మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయశాఖ అధికారులు చేరుకున్నారు. అకాల వర్షం, వడగళ్ల వానకు నష్టపోయిన పంటలను పరిశీలించనున్న మంత్రులు, అధికారులు పరిశీలించారు.
ఏపీ ప్రజల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని బాలకృష్ణ అన్నారు. ఏపీ ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని…. ఇకమీదట కూడా ఇలానే ఉంటుందన్నారు.
Advertisement
తిరుమల 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా…. నిన్న శ్రీవారిని 59,776 మంది భక్తులు దర్శించుకున్నారు.
తెలుగురాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆర్టీసీ ఎక్స్‌రోడ్స్, మాసబ్‌ట్యాంక్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో వర్షం కురుస్తోంది.
Advertisement
మరి కాసేపట్లో ఢిల్లీ విమానాశ్రయానికి రామ్ చరణ్ బయలు దేరనున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ తర్వాత మొదటిసారి ఇండియాకి రాంచరణ్ రాబోతున్నారు. సాయంత్రం మోడీ తో భేటీ కానున్నారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై రేపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ నిరసన దీక్ష చేపడుతున్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ మరియు నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోసారి ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు. రేపే తమ పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని కవిత తరపు న్యాయవాదులు కోరుతున్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఏ వీ ఎన్ రెడ్డి విజయం సాధించారు.