Home » Mar 15th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Mar 15th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

జనసేన 10వ ఆవిర్భావ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ నుంచి వారాహి యాత్ర మొదలయ్యింది. దారి పొడవునా హారతులిచ్చి ఆశీర్వదించిన ఆడపడుచులను, స్వాగతం పలికిన జనసేన శ్రేణులను ఎప్పటికీ మర్చిపోనని పవన్‌ అన్నారు.

తెలంగాణలో మరోసారి ఐటీ దాడులు జరుగుతున్నాయి. క్రిస్టియన్‌ మిషనరీలతో పాటు సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 40 చోట్ల ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. అల్వాల్‌, బొల్లారం, కీసర, జీడిమెట్ల, పటాన్‌చెరు, సికింద్రాబాద్‌, మెదక్‌, వరంగల్‌లో సోదాలు జరుగుతున్నాయి.

Advertisement

ఏపీ, తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం ప్రారంభం అయ్యాయి. ఏపీలో 1,489 కేంద్రాలు.. తెలంగాణలో 1,473 కేంద్రాల్లో ఉదయం 9 గంటలకు పరీక్షలు ప్రారంభం అయ్యాయి.

Advertisement

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిపోయింది. కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకూండా నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. నిన్న శ్రీవారిని 63,287 మంది భక్తులు దర్శించుకున్నారు.

హైదరాబాద్‌ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలో మధ్యాహ్నం జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొననున్నారు.

అమిత్ షా తో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయిరెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఏపీకి రావాల్సిన అభివృద్ధి కేటాయింపుల అంశంపై అమిత్ షా తో చర్చించారు.

మహారాష్ట్ర లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే కేసులు రెట్టింపు అయ్యాయి.

మెటాలో ఉద్యోగుల కోత కొనసాగుతూనే ఉంది. తాజాగా మెటా 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపింది.

Visitors Are Also Reading