తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా మంచి గుర్తింపు సాధించాడు వేణు. అప్పట్లో చాలా సినిమాల్లో ఈయన నటించేవారు. కానీ ఈ మధ్యకాలంలో కాస్త ఆయన సినిమాల జోరు తగ్గింది. అలాంటి కమెడియన్ వేణు కమెడియన్ నుంచి డైరెక్టర్ గా మారారు. బలగం సినిమాకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు సాధించాడు. తనలో కూడా టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు.ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అయితే ఇండస్ట్రీలో దర్శకులు హీరోలు హీరోలు దర్శకులుగా , కమెడియన్స్ హీరోలుగా మారడం అనేది సర్వసాధారణమైన విషయమే.
also read:కృష్ణ కాలర్ పట్టుకున్న నాగార్జున…భగ్గుమన్న కృష్ణ ఫ్యాన్స్ చివరికి ఏం చేశారంటే..?
Advertisement
కానీ అలా మారినప్పుడు కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది డీలా పడతారు. కానీ వేణు మాత్రం తీసిన మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా చేసి డైరెక్టర్ గా సక్సెస్ అయిన వారైతే లేరు. బలగం సినిమాతో సక్సెస్ అయి రికార్డు క్రియేట్ చేశారు వేణు . అంతేకాకుండా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా వీరిని ప్రత్యేకంగా అభినందించారు. అయితే ఒక కమెడియన్ దర్శకుడిగా మారితే అతడి నుంచి కామెడీ కథలే వస్తాయని అనుకుంటారు . అలా కమెడియన్ గా ఉన్న వేణు అందరినీ కన్నీరు పెట్టించే కథ తో బలగం ను తెరకెక్కించారు.
Advertisement
also read:RRR Oscar award 2023: ఆస్కార్ అందుకున్న RRR.. రికార్డు క్రియేట్ చేసిన “నాటు నాటు”..!!
ఇదిలా ఉండగా వేణు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సినీ కెరియర్ గురించి చెప్పుకొచ్చారు.. 1999 ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చిన వేణు చాలా సమస్యలు ఎదుర్కొన్నారట. కొన్ని రోజులు తిరిగాక ఓ చిన్న సినిమాకు ఓ షెడ్యూల్లో అసిస్టెంట్ మొదటిసారి ఛాన్స్ వచ్చిందట. తర్వాత రచయిత దగ్గర ఆరు నెలలు పని చేశానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత కమెడియన్ చిత్రం శ్రీను అన్న దగ్గర టచ్ అప్ బాయ్ గా పని లో చేరారట. ఇక అప్పటినుంచి సినిమాలలో కమెడియన్ గా నటించాను అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం వేణు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
also read:Sr. NTR-వెంకటేష్ చేయాలనుకున్న మల్టీస్టారర్ ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?