Home » మంగళసూత్రం విషయంలో మహిళలు ఈ పొరపాటు మాత్రం చేయకండి..!

మంగళసూత్రం విషయంలో మహిళలు ఈ పొరపాటు మాత్రం చేయకండి..!

by Anji
Ad

హిందూ సాంప్రదాయం ప్రకారం.. మహిళలు పెళ్లి సమయంలో మంగళసూత్రాన్ని ధరిస్తుంటారు. మహిళలకు పెళ్లి అయిందంటే మంగళసూత్రం ఒక గుర్తు అనే చెప్పాలి. సమాజంలో మహిళల గౌరవానికి మూలం మంగళసూత్రం. పెళ్లి తరువాత మహిళలు వివాహపు ఉంగరాన్ని, మంగళసూత్రాన్ని, కాలి మెట్టెలను, నుదుటిపై కుంకుమ ధరించడం కుటుంబాన్ని నిర్వహించగలిగిన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. 

Also Read :  ఈ నాలుగు రాశుల వారి వద్ధ సరిపడా డబ్బు ఉండదు.. అప్పుల పాలు కూడా..!

Advertisement

సమాజంలో గౌరవప్రదమైన బాధ్యతను స్వీకరించిన మనిషిగా మహిళకు సముచితమైన స్థానాన్ని కలుగజేస్తుంది. వివాహిత మహిళ కచ్చితంగా వీటిని ధరించాలని శాస్త్రం పేర్కొంటుంది. మంగళ సూత్రం అంటే.. మంగళకరమైన బంధం. పెళ్లి రోజు వధువు మెడలో వరుడు కట్టే ఓ ప్రత్యేకమైన ఎన్నటికీ విడదీయలేని పవిత్రమైన బంధం మంగళసూత్రం. నిబద్ధకు, ప్రేమకు నమ్మకానికి గుర్తుగా భర్త బ్రతికినంత కాలం భార్య మంగళ సూత్రాన్ని ధరించాలని శాస్త్రం తెలియజేస్తుంది. వేద మంత్రాలతో బంధు, మిత్రుల కుటుంబ సపరివార సమేతంగా ప్రతీ ఒక్కరి ఆశీర్వాదాలతో ఎంతో పవిత్రంగా కట్టే మంగళ సూత్రం విషయంలో స్త్రీలు కొన్ని జాగ్రత్తలు పాటించాలి.  

Advertisement

Also Read :  ఆన్ లైన్ లో చింతగింజల ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

 

మంగళసూత్రం మహిళల హృదయం వద్ద ఉంటుంది. మంగళసూత్రానికి హెయిర్ పిన్నులు, పిన్నిసులు పెట్టడంతో దివ్వమైన శక్తిని ఆకర్షించి భర్తను శక్తిహీనుడిగా చేస్తాయని.. భర్తకు అనారోగ్యం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. భార్యభర్తల పట్ల ఒకరిపై ఒకరికి అనురాగం తగ్గిపోతుందని తెలుపుతున్నారు. పొరపాటున కూడా మంగళసూత్రానికి పిన్నిసులు, హెయిర్ పెన్నులు పెట్టకూడదని తెలియజేస్తున్నారు. నరదిష్టు నుంచి భర్తను రక్షించేది ఇదే. మంగళ సూత్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మెడలో నుంచి తీయకూడదు. మెడ నుంచి తీయకుండా ఉండటం మంచిది అని శాస్త్రంలో కుచ్చే నల్లపూసల్లో శక్తి ఉంటుంది. ఆ జంటను నరదిష్టు నుంచి కూడా రక్షిస్తుంది. భర్తకు పరిపూర్ణమైన ఆయుష్షును కలిగిస్తుంది. కాబట్టి భర్త ఆయుష్షు కోసం మంగళసూత్రాన్ని ఎప్పటికీ కూడా మెడలోంచి తీయకూడదు. 

Also Read :  గుండెపోటు ఉన్నవారు గుడ్డు తినవచ్చా… తింటే ఏమవుతుంది?

Visitors Are Also Reading