Home » హీరోయిన్ లయకి చిరంజీవి సాయం చేశారా..? ఆమె ఆస్తులు ఎన్ని కోట్లంటే..?

హీరోయిన్ లయకి చిరంజీవి సాయం చేశారా..? ఆమె ఆస్తులు ఎన్ని కోట్లంటే..?

by Anji
Ad

సాధారణంగా తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టమనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఇవ్వరనే టాక్ ఉన్నప్పటికీ తెలుగు అమ్మాయి మాత్రం హీరోయిన్ గా మంచి సక్సెస్ చూసి కెరీర్ లో ఎలాంటి రిమార్క్స్ లేకుండా పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఆ అమ్మాయి మరెవ్వరో కాదు.. స్వయంవరం చిత్రంతో పరిచయమైన హీరోయిన్ లయ. ఫస్ట్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. వరుస హిట్ లతో పాటు నంది అవార్డులను కూడా అందుకుంది.  

Also Read :  అందంగా కనిపించేందుకు ముక్కుకు సర్జరీ చేయించుకున్న స్టార్ హీరోయిన్.. చివరికీ ఏమైందంటే..? 

Advertisement

నటనతో అందరినీ మెప్పించిన లయ కెరీర్ బాగున్న సమయంలోనే పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిలయ్యారు. ఇక ఆ తరువాత కుటుంబ బాధ్యతలకు దగ్గర అయిన లయ సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకుంటున్న లయ..నిత్యం  సోషల్ మీడియాలో అభిమానులకు టచ్ లోనే ఉంటున్నారు.  తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ తన ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన ఆస్తుల గురించి ఎదురైన ప్రశ్నకు లయ తాను ముఖేష్ అంబానీ చెల్లిని అంటూ సరదాగా చెప్పారు. తనకు సొంత విమానముందని, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయని ఏవేవో అనుకుంటారు కానీ అలాంటిది ఏమి లేదు అని వెల్లడించింది. 

Advertisement

Also Read :  2008లోనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించిన హనీరోజ్…ఆ సినిమా ఏదంటే…?

“మా భర్త డాక్టర్ కావడం వల్ల తనకు మూడు హాస్పిటల్స్ ఉన్నాయని.. కొంత బాగానే ఉన్నప్పటికీ. మరీ ఓన్ ఫ్లైట్, టాటా మనవరాలిని అనేంత రేంజ్ కాదు” అని చెప్పుకొచ్చారు. ఇక సోషల్ మీడియాలో వచ్చినటువంటి గాసిప్స్ గురించి మాట్లాడుతూ., “నేను  ఆర్థిక కష్టాల్లో ఉంటే చిరంజీవి గారు సహాయం చేశారనే వార్తలు రాశారు. కానీ నాకు ఎప్పుడూ అలాంటి అవసరం రాలేదు. మా నాన్న డాక్టర్. ఆర్థికంగా బాగానే ఉన్నాను. నేను ఒకే కూతురుని నచ్చింది చేయమనే వారు నాన్నగారు. అందుకే అలా సినిమాల్లోకి వచ్చాను. ఏ రోజూ కూడా రెమ్యునరేషన్ విషయంలో అసలు ఆలోచించలేదు. ఎంతో మంది నాకు రెమ్యునరేషన్ ఎగ్గొట్టారు. నేను వదిలేశాను” అని చెప్పుకొచ్చారు లయ. 

Also Read :  అందంగా కనిపించేందుకు ముక్కుకు సర్జరీ చేయించుకున్న స్టార్ హీరోయిన్.. చివరికీ ఏమైందంటే..? 

 

Visitors Are Also Reading