ప్రస్తుతం రాజమౌళి దేశంలోనే టాప్ డైరెక్టర్ గా ఉన్నారు. పాన్ ఇండియా చిత్రాలతో రాజమౌళి ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాహుబలి సినిమా తరవాత జక్కన్న కు ఇండియా లెవల్ లో క్రేజ్ పెరిగిపోయింది. ఇక రీసెంట్ గా జక్కన్న ఆర్ఆర్ఆర్ తో మరో ప్రభంజనం సృష్టించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ సినిమా వేల కోట్లు వసూళు చేయగా ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ లో డబ్ చేసి విడుదల చేశారు.
Advertisement
కాగా విదేశాల్లోనూ ఈ సినిమాకు ఫిదా అయ్యారు. అంతే కాకుండా హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్ సైతం ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రశంసించాడు అంటూ ఆ సినిమా ఎక్కడకి వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా ఈ సినిమాలోని నాటునాటు పాట ఏకంగా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. దాంతో ఆస్కార్ వేదిక పై నాటునాటు పాట మోగుతోంది.
ALSO READ : ఈ 3 వ్యాధులు ఉన్న వారు వేరు శనగ తింటే ప్రమాదంలో పడ్డట్టే..?
Advertisement
ఇక ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ మేకర్స్ భారీగా ఖర్చు పెడుతున్నారు. అయితే ఆస్కార్ కు ఖర్చుపెట్టడం పై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆస్కార్ కోసం రూ.80 కోట్ల వరకూ ఖర్చు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. విమానాల ఖర్చులు మరియు హోటల్ బుకింగ్స్ ల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు.
కాగా తమ్మారెడ్డి మాట్లాడుతూ…ఆర్ఆర్ఆర్ సినిమాను రూ.600 కోట్లతో నిర్మించవచ్చు. కానీ ఆ సినిమాకు ఆస్కార్ కోసం 80 కోట్లను ఖర్చు చేశారు. అదే 80 కోట్లు ఇస్తే 8 సినిమాలు తీసేవారు ఉన్నారు. పది సినిమాలు తీసి మొహాన కొట్టేవాళ్లు కూడా ఉన్నారు. అంటూ తమ్మారెడ్డి కామెంట్స్ చేశారు. ఇక తమ్మారెడ్డి చేసిన కామెంట్స్ పై నెటిజన్ లు ఫైర్ అవుతున్నారు. 80 కోట్లతో 8 సినిమాలు తీయవచ్చు కానీ అవి ఆస్కార్ కు నామినేట్ అవుతాయా..? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ALSO READ :ఈ 3 వ్యాధులు ఉన్న వారు వేరు శనగ తింటే ప్రమాదంలో పడ్డట్టే..?