Home » తెలుగు ప్రజలకు భూకంప హెచ్చరిక: ఈ ప్రాంతాల వారికి ప్రమోదం.. సేఫ్ ప్లేస్ ఇదే..!!

తెలుగు ప్రజలకు భూకంప హెచ్చరిక: ఈ ప్రాంతాల వారికి ప్రమోదం.. సేఫ్ ప్లేస్ ఇదే..!!

by Sravanthi Pandrala Pandrala

ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో భూకంపం వనికిస్తోంది. అలాగే భారతదేశంలో కూడా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి ప్రదేశాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే ఇండియాలో ఇలాంటి ప్రదేశాల్లో భూకంపాలు వస్తాయి.. సేఫ్ ప్లేస్ ఏది.. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఇటీవల కాలంలో ఉత్తర భారతంలో కొన్ని ప్రాంతాలలో, దక్షిణ భారత్లోని కొన్ని ప్రాంతాలలో భూకంపాలు సంభవించాయి. వరుసగా ప్రకంపనులు సంభవిస్తున్న సందర్భంలో భూగర్భ నిపుణులు కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇండియాలో భూకంప తీవ్రత అధికంగా ఉండే అవకాశం లేదని నిపుణులు తెలియజేస్తున్నారు. భూకంపం అనేది భూగర్భంలోని పలకలు ఢీకొనడం వల్ల ఏర్పడుతుందని అధికారులు అంటున్నారు.

also read:సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నటుడు, దర్శకుడు మృతి

బారత ఉపఖండం ఇండియన్ ప్లేట్ పై ఉందని, దీన్నే ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్ అంటారు. ఈ ప్లేట్ ఉత్తరం వైపునకు ఏడాదికి 49 మిల్లీమీటర్ల చొప్పున కదులుతోంది. అలా కదిలిన సమయంలో ఎగువ భాగంలో ఉన్న యురోషియన్ ప్లేటును ఢీకొంటుందని , దీనివల్ల హిమాలయాలు ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. ఈ హిమాలయాలకు సమీపంలో భూకంప కేంద్రం ఉంటుందని స్పష్టం చేశారు. కాబట్టి భారత హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా భూకంపాలు సంభవించే అవకాశం అన్నారు. ఈ కారణంగానే ఇటీవల జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ భూకంపం సంభవించినట్టు భూగర్భ నిపుణులు తెలియజేశారు.

also read:44 బంతుల్లోనే సెంచరీ.. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ ఆటగాడు..!

ఇక దక్షిణ భారతదేశంలో భూకంపానికి అవకాశం లేదని, సముద్ర తీర ప్రాంతాల్లో తమిళనాడు, ఒరిస్సా, మహారాష్ట్ర, కేరళ,కర్ణాటక, గోవా ప్రాంతాలు ఉన్నాయని ఆయ రాష్ట్రాల్లో స్వల్ప భూకంప ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా స్వల్పంగా భూకంపం వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఖమ్మం, భద్రాచలం, వరంగల్ ప్రాంతాల్లో భూకంపం సంభవించే అవకాశం ఉండగా, ఏపీలో రాజమండ్రి, విజయవాడ, కాకినాడ, గుంటూరు, నెల్లూరులో భూమి కల్పించే అవకాశం ఉన్నట్లు భూగర్భ నిపుణులు తెలియజేస్తున్నారు.

also read:Mar 9th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Visitors Are Also Reading