Home » Sr: ఎన్టీఆర్ కుటుంబానికి, శ్రీదేవికి మధ్య విడదీయరాని బంధం ఉందని మీకు తెలుసా..?

Sr: ఎన్టీఆర్ కుటుంబానికి, శ్రీదేవికి మధ్య విడదీయరాని బంధం ఉందని మీకు తెలుసా..?

by Sravanthi
Published: Last Updated on
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యామిలీలలో నందమూరి ఫ్యామిలీ చాలా గొప్ప ఫ్యామిలీ అని చెప్పవచ్చు. ఈ ఫ్యామిలీ నుంచి సినిమా పరంగానే కాకుండా రాజకీయపరంగా కూడా ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. ఇందులో మొదటి తరం హీరోలలో సీనియర్ ఎన్టీఆర్ ఉండగా, ఆయన వారసులుగా హరికృష్ణ,బాలకృష్ణ స్టార్ హీరోలుగా ఎదిగారు.. ఇక వీరి తర్వాత మూడవ తరం హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో కళ్యాణ్ రామ్,ఎన్టీఆర్ స్టార్ హోదాను సంపాదించుకున్నారు.

also read:మెగాస్టార్ త‌మ్ముడు నాగబాబు ఇండ‌స్ట్రీలో ఎందుకు స‌క్సెస్ అవ్వ‌లేదు…కారణం అదేనా.?

Advertisement

 

ఇక జూనియర్ ఎన్టీఆర్ అయితే పాన్ ఇండియా స్టార్ గా మారారు, తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నాడు. అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో NTR 30 అనే చిత్రంలో నటించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం గత కొంతకాలంగా సెర్చ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి హీరోయిన్ ఫైనల్ అయిందని ఆమె అందాల తార శ్రీదేవి కూతురు అయినా బ్యూటీ జాన్వి కపూర్ అని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ సరసన ఈమె జోడి కట్టబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Advertisement

also read:ల‌వ‌ర్ కోసం క‌లెక్ట‌ర్ అయ్యాడు.! కోట్ల జీతం వ‌దిలి కొత్త జీవితంలోకి….!

ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. అలాంటి శ్రీదేవి కుటుంబానికి సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. అలనాటి ఎన్టీఆర్ బడిపంతులు సినిమాలో తారక రామారావు మనవరాలిగా శ్రీదేవి చేసింది,ఆ తర్వాత తరంలో ఆయనతో హీరోయిన్ గా కూడా ఎన్నో సినిమాల్లో చేసింది. సీనియర్ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ శ్రీదేవి ఫ్యామిలీ హీరోయిన్ తో జతకట్టబోతున్నాడు.. ఈ తరుణంలో జాన్వికపూర్ మాట్లాడుతూ.. మాకు నందమూరి కుటుంబానికి చాలా అనుబంధం ఉందని, ఎన్టీఆర్ తో నటించడం నా కల అని అది నెరవేరబోతోందని ట్విట్ చేసింది..

also read:

Visitors Are Also Reading