అన్న ఎన్టీఆర్ కు మొత్తం 12 మంది సంతానం. ఇందులో ఎనిమిది మంది కుమారులు నలుగురు అమ్మాయిలు. పురందేశ్వరి అమ్మాయిలలో పెద్దది. దగ్గుబాటి వెంకటేశ్వరరావుని వివాహం చేసుకున్న పురందేశ్వరి రాజకీయాల్లో రాణిస్తోంది. ఆమె తర్వాత లోకేశ్వరి,భువనేశ్వరి, ఉమామహేశ్వరి ఉన్నారు. ఇక అబ్బాయిలు ఎనిమిది మందిలో చాలా పాపులర్ అయింది బాలకృష్ణ. ఆయన రాజకీయాలు మరియు సినిమాల్లో స్టార్ గా ఎదిగారు. ఆ తర్వాత హరికృష్ణ తెలుగు ప్రజలకు పరిచయమే. కానీ మిగతా ఆరుగురు కుమారుల గురించి చాలామందికి తెలియదు.
also read:చిరంజీవికి అస్సలు అచ్చిరాని క్లాస్ సినిమాలు… ఎందుకు ఇలా!
Advertisement
ఇందులో ఎన్టీఆర్ కి మొదటి సంతానమైన అబ్బాయి రామకృష్ణ. ఆయన నిర్మాతగా మారారు.ఆయన పేరున ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియో కూడా ఏర్పాటు చేశారు. కానీ రామకృష్ణ కన్నుమూసారు. రెండవ సంతానంగా జయకృష్ణ.. ఈయన కూడా ఎక్కువ మందికి తెలియదు. మూడవ కుమారుడు పేరు సాయికృష్ణ. ఈయన 2004లో చనిపోయారు.దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో సాయి కృష్ణ అకాల మరణం పొందారు.
Advertisement
also read:పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్… అసలు కారణం ఇదే,?
ఇక నాలుగవ సంతానం హరికృష్ణ. ఈయన జనాల్లో ఎక్కువగా పాపులారిటీ సాధించిన హీరో. రాజకీయాల్లో కూడా ఎన్టీఆర్ కు రైట్ హ్యాండ్ గా ఉండే హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈయన కుమారులు కళ్యాణ్ రామ్,జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగారు. ఇక ఎన్టీఆర్ ఐదవ కుమారుడు మోహనకృష్ణ. ఈయన గురించి జనాలకు తెలిసింది తక్కువే. ఇక ఆరవ కొడుకు బాలకృష్ణ. ఈయన ఇండస్ట్రీలో బాల నటుడిగా అడుగుపెట్టి ప్రస్తుతం స్టార్ హోదాలో కొనసాగుతున్నారు.
also read:లవర్ కోసం కలెక్టర్ అయ్యాడు.! కోట్ల జీతం వదిలి కొత్త జీవితంలోకి….!