హిందూ, ముస్లిం భాయి భాయి అనే మాటకు అర్థం వచ్చేవిధంగా ఓ ముస్లిం జంట హిందూ దేవాలయంలో పెళ్లి చేసుకున్న ఘటన ఆసక్తి రేకెత్తిస్తోంది. షిమ్లాలోని రాంపూర్ లో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవాలయంలో ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం.. ఈ నిఖా జరిగింది. హిందూ దేవాలయంలో ముస్లిం సంప్రదాయ ప్రకారం.. ముస్లిం జంట పెళ్లి వేడుకకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Also Read : కేజీఎఫ్ పై నోరు పారేసుకున్న తెలుగు డైరెక్టర్… సినిమాను సినిమాలానే చూడాలంటూ నెటిజన్స్ ఫైర్…!
Advertisement
అయితే రాంపూర్ లో ఉన్నటువంటి థాకూర్ సత్యనారాయణ్ దేవాలయంలో పూజలు, గుడి నిర్వహణ బాధ్యతలను విశ్వహిందూ పరిషత్ నిర్వహిస్తోంది. ఈ పెళ్లి వేడుకకు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. పెళ్లి కోసం కేవలం రెండు ముస్లిం కుటుంబాలు మాత్రమే ఆలయానికి రాలేదు. పెళ్లి తంతును దగ్గర ఉండి జరిపించి నూతన జంటను ఆశీర్వదించేందుకు ముస్లిం కుటుంబాలు, హిందువులు కుటుంబాలు భారీ సంఖ్యలో ఆలయానికి వచ్చి ఈ వేడుకను కన్నుల పండుగను చేసాయి.
Also Read : హోలీ పండుగకి నేచురల్ గా రంగులను ఎలా తయారు చేయాలో తెలుసా ?
Advertisement
దేవాలయం ఆవరణలో మౌల్వి, న్యాయవాది, సాక్షులు ఈ నిఖాను దగ్గర ఉండి మరీ జరిపించారు. హిందూ, ముస్లిం సోదర భావంతో మెలగాలి అనే సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే సదుద్దేశంతోనే హిందూ దేవాలయంలో ఇస్లాం సంప్రదాయ ప్రకారం.. నిఖా చేసుకున్నట్టు రెండు కుటుంబాలు వెల్లడించాయి. వధూవరులిద్దరూ వృత్తి రీత్యా ఇంజనీర్లే. ఉన్నత చదువులు చదువుకున్న కుటుంబాలు కావడంతో ఇరు కుటుంబాలు ఏకాభిప్రాయానికి రావడం చాలా సులభం అయింది. సిమ్లాలోని సత్యనారాయణ్ మందిరం విశ్వహిందూ పరిషద్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థలకు జిల్లా ప్రధాన కార్యాలయంగా కొనసాగుతుండడం విశేషం. మత సామరస్యం వెల్లివిరిసేలా భారతదేశం బాహు సంస్కృతులకు నిలయమని చాటి చెప్పేలా.. ఇక్కడ దేవాలయంలో నిఖా చేసుకునేందుకు ఇస్లాం కుటుంబాలు ముందుకు రావడం గొప్ప విషయం కాగా.. వారి విజ్ఞప్తిని సహృదయంతో అర్థం చేసుకొని వారికి ఆలయ ప్రవేశం కల్పించిన విశ్వ హిందూ పరిషద్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థలపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Also Read : Chanakya Niti : లక్ష్మీదేవి ఎక్కువగా అక్కడే ఉంటుందా ? వారికి డబ్బు లోటు ఉండదు