ఒకప్పుడు సినిమా తారలు… సంపన్న కుటుంబంలోని మహిళలు మాత్రమే ముఖానికి మేకప్ లు వేసుకునేవారు. సాధారణ ప్రజలు మేకప్ వేసుకోవడం చాలా అరుదు. అయితే ప్రస్తుతం చాలామంది మేకప్ వేసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా శుభకార్యం సమయంలో మహిళలు ఖచ్చితంగా మేకప్ వేసుకుంటున్నారు.
Advertisement
అయితే ఈ నేపథ్యంలోనే ఓ వధువు పెళ్లిరోజున అందంగా కనిపించాలని మేకప్ వేసుకుంది. అయితే అది కాదా కాస్త బెడిసి కొట్టడంతో ఆమె రూపం వికారంగా మారింది. దాంతో చివరికి పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది. ఈ ఘటన కర్ణాటకలోని అస్సామ్ జిల్లాలో చోటుచేసుకుంది. అస్సామ్ జిల్లాలోని ఓ గ్రామంలో మరికొన్ని గంటల్లో పెళ్లి జరగాల్సి ఉంది.
Advertisement
ఇక పెళ్లికూతురు మేకప్ కోసం బ్యూటీ పార్లర్ వెళ్ళింది. ఈ నేపథ్యంలో కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని అనుకున్న యువతి ముఖానికి మూడు రకాల క్రీమ్ లను పూసుకుంది. ఆ తర్వాత స్టీమ్ ను అప్లై చేసుకుంది. దాంతో ఒక్కసారిగా ఆమె ముఖం నల్లగా మారిపోయింది.
అంతేకాకుండా ముఖం ఉబ్బిపోయింది. దాంతో ముఖం పూర్తిగా వికారంగా మారిపోయింది. ఇక ఆ రూపంలో ఆమెను చూసిన పెళ్ళికొడుకు తనకు పెళ్లి వద్దని మండపం నుంచి వెళ్లిపోయాడు. ఇక పెళ్లి క్యాన్సిల్ అవడంతో యువతి తల్లిదండ్రులు బ్యూటీ పార్లర్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
also read :12 ఏళ్లు ప్రేమించుకున్నాం… 6 ఏళ్లు కష్టాలు అనుభవించాం- మంచి మనోజ్