సాధారణంగా సినిమా ప్రపంచంలో కొన్ని విషయాల్లో దాదాపుగా అందరికీ సానుకూల అభిప్రాయం ఉంటుంది. వివాదాలతో కానీ సినిమా అంశాలలో కానీ ఏమాత్రం తల దూర్చకుండా తమ పని ఏదో తాము చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పట్లో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం, ఆ తర్వాత అక్కినేని సతీమణి అన్నపూర్ణమ్మ, అదేవిధంగా శోభన్ బాబు భార్య, కృష్ణ భార్య ఇందిరా దేవి, చిరంజీవి భార్య సురేఖ ఇలా కొందరు ఎవరి పని వారు చూసుకుంటారు.
Also Read : ధనుష్ ఐశ్వర్య బాటలో మరో స్టార్ కపుల్…అతిత్వరలోనే విడాకులు..?
Advertisement
భర్తలు ఎంతటి స్టార్ హీరోలు అయినప్పటికీ వారి వ్యవహారాల్లో మాత్రం ఎప్పుడూ జోక్యం చేసుకునే పరిస్థితి ఉండదు. ఇక బసవతారకం కు సురేఖకు మధ్య కొన్ని అంశాల్లో పోలిక ఉందని అంటుంటారు సినీ ప్రముఖులు. ఎన్టీఆర్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా.. సరే ఆమె ఇంటి పట్టునే ఉండేవారు. షూటింగ్ విషయంలో కూడా జోక్యం చేసుకునే వారు కాదు. సినిమా వాళ్లు వచ్చినా ఫ్యాన్స్ వచ్చినా సరే వారికి వంట చేసి తిన్న తరువాతనే పంపిస్తారట.
Advertisement
చిరంజీవి భార్య కూడా దాదాపు అంతే అంటారు. చిరంజీవిని కలవడానికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా భోజనం పెట్టకుండా అస్సలు పంపించరట. మెగాస్టార్ అభిమానులు వచ్చినా వారికి కచ్చితంగా భోజనం ఉంటుందట. రాధా, రాధిక వంటి పలువురు హీరోయిన్లు కూడా గతంలో ఈ విషయాన్ని చెప్పారు. తాము షూటింగ్ సమయంలో చిరంజీవి ఇంటికి వెళ్తే సురేఖ మాకు అన్ని దగ్గరుండి మరీ చూసుకునే వారు. తమకు కావాల్సినవి ఏదైనా సరే వండి పెట్టే వారని.. అంత మంచి మనసున్న ఆమెను మేము ఎప్పుడూ చూడలేదని పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు.
Also Read : ఎన్టీఆర్ బాలకృష్ణకి ఇచ్చిన ఆస్తి పై లక్ష్మిపార్వతి ఏమన్నారో తెలుసా ?